ఎందరైనగలరు /ENDARAINA GALARU /AAV 10 EP 956/ K RAMACHARY/YASASWY NANDAVAREEK/ DHARMAVATHI
ANNAMAYYA AKSHARA VEDAM
0:00 / 0:00
ఎందరైనగలరు /ENDARAINA GALARU /AAV 10 EP 956/ K RAMACHARY/YASASWY NANDAVAREEK/ DHARMAVATHI
699 просмотров · 10 дн. назад
ANNAMAYYA AKSHARA VEDAM
18,7 тыс. подписчиков
699 просмотров · 10 дн. назад
ANNAMAYYA AKSHARA VEDAM EP – 956
🌺🍃 -----------🍃🌺
తాళ్లపాక అన్నమాచార్య ఆధ్యాత్మ సంకీర్తన
( ఎందరైనగలరు నీ కింద్రచంద్రాదిసురలు.. )
రేకు రాగము :- నాట
రేకు: 0207-06 సంపుటము: 3-42
స్వరకర్త:- శ్రీ కొమండూరి రామాచారి గారు గారు
రాగం :-- ధర్మవతి
గానం:- శ్రీ చింతగుంట యశశ్వి నందవరీక్ గారు
🌺🍃 -----------🍃🌺
🌹🌹 సంకీర్తన 🌹🌹
॥పల్లవి॥
ఎందరైనఁ గలరు నీ కింద్రచంద్రాదిసురలు
అందులో నే నెవ్వఁడ నీ వాదరించే దెట్టో
॥చ1॥
పెక్కు బ్రహ్మాండములు నీ పెనురోమకూపములఁ
గిక్కిరిశున్న వందొక కీటమ నేను
చక్కఁగా జీవరాసుల సందడిఁ బడున్నవాఁడ
ఇక్కువ నన్నుఁ దలఁచి యెట్టు మన్నించేవో
॥చ2॥
కోటులైన వేదములు కొనాడీ నిన్నందులో నా-
నోటి విన్నపము లొక్క నువ్వుగింజంతే
మాటలు నేరక కొఱమాలి వాకిట నుండ
బాటగా నీదయ నాపైఁ బారుటెట్టో
॥చ3॥
అచ్చపు నీదాసులు అనంతము వారలకు
రిచ్చల నేనొక పాద రేణువ నింతే
ఇచ్చగించి శ్రీవేంకటేశ నిన్నుఁ దలఁచుక
మచ్చికఁ గాచితి నన్ను మఱవనిదెట్టో
🌺🍃 -----------🍃🌺
అన్నమయ్య అక్షరవేదం సంపుటి – 956
( ఎందరైనగలరు నీ కింద్రచంద్రాదిసురలు .. )
🌺🍃 ----------- 🍃🌺
ప్రార్థన :-
మనుజుడ నల్పుడనయ నీ
వనంత బ్రహ్మాండములకు నధిపతివయ్యా !
కనుగొని యీ దీనుని నిట
ననువుకొనుచు దయను జూపు టదియెట్లౌనో ?
✍️ --స్వీయపద్యము ( కందము)
🌹🌹
నేను చాలా చిన్నవాడనైన, ఒక సాధారణ మనుషుడిని .
నీవు మాత్రం అంతం లేని ఈ సమస్త విశ్వానికి ప్రభువువు/యజమానివి.
నన్ను చూసి, గుర్తించి. ఏమీ లేనివాడనైన నన్ను.
ఇక్కడ చేరదీస్తూ , నీ అపారమైన దయను నాపై చూపించడం ఎలా సాధ్యమౌతోంది స్వామి?
🙏 🌹🙏
🌹 🌺🍃 -----------🍃🌺
మున్నుడి 🌹
ఈ కీర్తన పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు పరమాత్ముడైన శ్రీవేంకటేశ్వరుని ముందు తన అణకువను, శరణాగతిని ప్రదర్శిస్తూ రచించిన అద్భుతమైన వైరాగ్య కీర్తన .
అనంత విశ్వంలో మానవుని ఉనికి ఎంత అల్పమైనదో చెబుతూనే, స్వామి కృప కోసం ఆర్తితో వేడుకునే భావం ఇందులో ఉంది.
అన్నమయ్య ఈ కీర్తన ద్వారా భగవంతుని అనంతత్వాన్ని, మానవుని అల్పత్వాన్ని అత్యంత సుందరంగా పోల్చారు.
సృష్టికర్త ముందు మన అహకారం ఎంత తగనిదో చెబుతూ, కేవలం నిష్కల్మషమైన శరణాగతి ద్వారా మాత్రమే ఆ దేవుని దయను పొందగలమనే పరమ సత్యాన్ని ఈ సంకీర్తన ద్వారా ప్రబోధించారు
మరి ఈ చక్కని కీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా !
🌹🙏🌹
🌹🌹
ఓ శ్రీనివాసా! ఇంద్రుడు, చంద్రుడు మొదలైన ఎందరో గొప్ప దేవతలు నీకు సేవకులుగా ఉన్నారు.
అటువంటప్పుడు ఆ దేవతల మధ్య అత్యంత అల్పుడనైన నేను ఎవరిని? అసలు నన్ను నువ్వు గుర్తించి, ఎలా ఆదరిస్తావు తండ్రీ?
🌹🌹
నీ విరాట్ స్వరూపంలోని రోమకూపాలలో (వెంట్రుకల కుదుళ్లలో) పెద్ద పెద్ద ఎన్నో కోట్లాది బ్రహ్మాండాలు ఇరుక్కుని ఉన్నాయి.
అంతటి విరాట్ రూపంలో నేను ఒక చిన్న పురుగు వంటివాడిని.
ఎంతో మంది జీవరాసుల గుంపులో పడి కొట్టుమిట్టాడుతున్నాను.
అటువంటి నన్ను ఒక ప్రత్యేకమైన వాడిగా గుర్తించి, నాపై దయ ఉంచి ఎలా మన్నిస్తావో కదా!
🌹🌹
కోట్ల కొద్దీ వేదాలు, ఉపనిషత్తులు నిరంతరం నిన్ను కీర్తిస్తూనే ఉంటాయి .
ఆ వేద మంత్రాల స్తోత్రాల ముందు నా నోటితో నేను చేసుకునే ప్రార్థనలు కేవలం ఒక చిన్న "నువ్వు గింజంత" మాత్రమే!
నీ గొప్పతనాన్ని స్తుతించే మాటలు చేతకాక, ఏ అర్హత లేనివాడినై అజ్ఞానమనే గుమ్మం వద్ద నిలబడి ఉన్నాను. మరి సరాసరి నీ కరుణా రసం ఒక ప్రవాహంలా నాపై ఎలా కురుస్తుంది స్వామి?
🌹🌹
నిన్నే నమ్ముకున్న నీ నిజమైన భక్తులు, దాసులు ఈ లోకంలో అనంతంగా ఉన్నారు. ఆ మహానుభావుల పాదాల కింద ఉండే ఒక చిన్న ధూళి కణాన్ని (పాద రేణువును) మాత్రమే నేను!
ఓ శ్రీవేంకటేశ్వరా! మనస్ఫూర్తిగా నిన్నే నమ్ముకుని, నీపై ఎంతో ప్రేమతో, నన్ను రక్షిస్తావనే ఆశతో ఎదురుచూసిన నన్ను , ఇంతటి దీనుడనైన నన్ను నువ్వు మరువకుండా ఎలా కాపాడుతున్నావో అదియే ఆశ్చర్యమయ్యా !
🌹🙏🌹
తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న
నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏
దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏
✍️ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏
#ఎందరైనగలరు #ENDARAINAGALARU #KRAMACHARY #YASASWYNANDAVAREEK #annamacharya #annamacharyakeerthanalu #annamayya #annamayyasongs #అన్నమయ్య #అన్నమాచార్య #annamayyakeerthanalu #annamayyakeerthana #annamayyaaksharavedam