Перейти к содержимому

ఏ యాజ్ఞ అయినబెట్టు/YE AGNA AYINA PETTU /AAV 10 EP 955 / PAVAN CHARAN / JONNALAGADDA SRIRAM/BAHUDARI

ANNAMAYYA AKSHARA VEDAM

0:00 / 0:00

ఏ యాజ్ఞ అయినబెట్టు/YE AGNA AYINA PETTU /AAV 10 EP 955 / PAVAN CHARAN / JONNALAGADDA SRIRAM/BAHUDARI

1 835 просмотров · 9 дн. назад
ANNAMAYYA AKSHARA VEDAM
18,7 тыс. подписчиков
1 835 просмотров · 9 дн. назад
ANNAMAYYA AKSHARA VEDAM EP – 955 🌺🍃 -----------🍃🌺 తాళ్లపాక పెదతిరుమలాచార్య సంకీర్తన ( ఏ యాజ్ఞ అయినబెట్టు యిదివో నా దుర్జనము.. ) రేకు రాగము :- దేసాళం రేకు: 0005-05 సంపుటము: 15-30 స్వరకర్త:- శ్రీ బోనిల పవన్ చరణ్ గారు రాగం :-- బహుదారి గానం:- శ్రీ జొన్నలగడ్డ శ్రీరామ్ గారు 🌺🍃 -----------🍃🌺 🌹🌹 సంకీర్తన 🌹🌹 ॥పల్లవి॥ ఏ యాజ్ఞ అయినఁ బెట్టు యిదివో నా దుర్జనము యే యపరాధమో కాని యింతేసి సేసితిని ॥చ1॥ ఆముకొని నీ దాసుఁడ ననేటి సలిగెలను వేమారుఁ బాపములకు వెరవ నైతిని నీ మఱుఁగు చొచ్చినట్టి నిజగర్వమే నమ్మి నేమపు పుణ్యములు మానితి నేను ॥చ2॥ తగిలి నీ ముద్ర మేన ధరించిన చనవున పగటున దేవతల పంపు సేయను నగుతా నీ నామము నాలికనున్న బీరాన జగతి నిత్య కర్మము జారి పోఁదోసితిని ॥చ3॥ హత్తి నాకుఁగలవు నీ వంతర్యామి వనుచు వుత్తమోపాయము లెల్ల నొల్ల నైతిని యిత్తల శ్రీ వేంకటేశ యేలికవు నీ వని మత్తుఁడనై అన్యచింత మఱచితిని 🌺🍃 -----------🍃🌺 అన్నమయ్య అక్షరవేదం సంపుటి – 955 ( ఏ యాజ్ఞ అయినబెట్టు యిదివో నా దుర్జనము.. ) 🌺🍃 ----------- 🍃🌺 ప్రార్థన :- పరిపూర్ణముగా శరణము హరి నీకే జేయువాని యపరాధంబుల్ నిరుహేతుక కృప తోడన్ పరిమార్చెదవన్చు నమ్ము వారలెదాసుల్ ! ✍️ --స్వీయపద్యము ( కందము) 🌹🌹 " నీకు సంపూర్ణముగా ఎవడైతే శరణాగతి చేస్తాడో , అటువంటి వాని పాపములను ఏ కారణమూ లేకుండానే నశింపచేసి , వానిని ఉద్ధరిస్తావు " అని ఎవరైతే సంపూర్ణమైన నమ్మకము కలిగి ఉంటారో వారే నీకు నిజమైన దాసులు కదా స్వామీ ! 🙏 🌹🙏 🌹 🌺🍃 -----------🍃🌺 మున్నుడి 🌹 ఈ కీర్తనలో తాళ్ళపాక పెదతిరుమలాచార్యుల వారు 'శరణాగతి' యొక్క గొప్పతనాన్ని చాటిచెప్పారు. భగవంతుడిని పూర్తిగా నమ్ముకున్నవాడికి లౌకిక నియమాలు, కర్మకాండలు, పాపభీతి వంటివి ఉండవని.. కేవలం ఆ స్వామి నామస్మరణ, శరణాగతి మాత్రమే చాలని ఒక పరమ భక్తుడి హృదయావిష్కరణగా దీనిని మలిచారు "అత్యంత భక్తితో, అలాగే కాస్త ప్రేమపూర్వకమైన చొరవతో అతను భగవంతునితో ధైర్యంగా ఒక విషయాన్ని ఒప్పుకుంటున్నారు/ప్రకటిస్తున్నారు. తాను పూర్తిగా ఆ దేవుని అనుగ్రహం (కృప) పైనే, మరియూ ఆతని ఆజ్ఞ మేరకే ఆధారపడి ఉన్నందువల్ల... లోకంలో ఉండే సంప్రదాయబద్ధమైన ఆచారాలను, నియమ నిబంధనలను మరియు లౌకికపరమైన (లోకసంబంధమైన) భయాలన్నింటినీ తాను పూర్తిగా నిర్లక్ష్యం చేశానని (పట్టించుకోలేదని) చెబుతున్నారు.". అవి ఒకవేళ అపరాధములే అయితే దానికి కూడా ఆ పరమాత్ముడినే వేడుకుంటున్నారు ఆతని చిత్తమునకే విడిచిపెట్టుచూ , స్వామి ఏమి చేసినా ఒప్పే అను నమ్మికతో ! గమనిక:- భౌతికపు కోరికలు తీర్చమనో , మరియింకేదో నెరవేర్చమనో స్వామికి మొక్కుకునే నా వంటి అల్పునకు నియమాలు , నియతులు , నిత్యానుష్ఠానముల ఉల్లంఘన ముమ్మాటికే అపరాధమే అవును గాని , ఆత్మనివేదన చేసుకుని పరమాత్ముడి శరణమునే నమ్మి ఉండి , అతని ఇచ్ఛకే అంతా వదిలిపెట్టిన మహానుభావులు ఏమి చేసినా ఏమి మానినా వారు ఎన్నటికే పుణ్యవర్తనులే ! మరి ఈ చక్కని కీర్తన అర్థము తెలుసుకుని పాడుకుందామా ! 🌹🙏🌹 🌹🌹 ఓ శ్రీనివాసా! నువ్వు నాకు ఏ శిక్ష విధించినా, ఏ ఆజ్ఞ వేసినా తలవంచుతాను, ఇదిగో నా చెడు స్వభావం (దుర్జనము). అది ఏ అపరాధమో, ఏ పాపమో నాకు తెలియదు కానీ, నీపై ఉన్న చొరవతో ఇంతటి సాహసాలు (నియమాలను ఉల్లంఘించడం) చేసేశాను 🌹🌹 "నేను నీ పరమ దాసుడిని" అనే గట్టి నమ్మకం మరియు చొరవతో నేను ఎన్నిసార్లు తప్పులు చేసినా, పాపాలు చేసినా వాటికి భయపడటం మానేశాను. ఎందుకంటే నీ శరణు వేడాననే అహంకారం లేదా ధీమా నాలో పెరిగింది. నువ్వు నన్ను ఎలాగూ రక్షిస్తావనే ఆ గర్వంతో, లోకంలో జనాలు చేసే నియమబద్ధమైన పుణ్యకార్యాలను, నోములను నేను పూర్తిగా విడిచిపెట్టేశాను. 🌹🌹 నా శరీరంపై నీ శంఖచక్రాల ముద్రలను ధరించిన చొరవతో, నేను ఇతర దేవతల ఆజ్ఞలను లేదా పనులను అస్సలు లెక్కచేయడం లేదు. నా నాలుకపై ఎప్పుడూ నీ నామస్మరణ (హరి నామం) నవ్వుతూ పలుకుతూ ఉంటుందనే గర్వంతో ఈ లోకంలో మానవులు రోజూ ఆచరించాల్సిన సంధ్యావందనం వంటి నిత్య కర్మలను కూడా నేను పక్కన పెట్టేశాను. 🌹🌹 నువ్వు నా హృదయంలోనే 'అంతర్యామి'విగా స్థిరంగా ఉన్నావనే దృఢ నిశ్చయంతో, మోక్షం కోసం పెద్దలు చెప్పే ఇతర ఉత్తమ ఉపాయాలను (జ్ఞాన, యోగ మార్గాలను) వేటినీ నేను కోరుకోలేదు. ఓ శ్రీ వేంకటేశ్వరా! ఈ లోకంలో నాకు సర్వస్వము, నా ప్రభువు నువ్వే అని, నీ భక్తి రసంలో మునిగిపోయి (మత్తుఁడనై) వేరే ఏ ఇతర ఆలోచనలను పూర్తిగా మరిచిపోయాను 🌹🙏🌹 ఇవియన్నీ అపరాధములయితే , నీవు ఏది తలంచితే అది చెయ్యి . నేను నీ చేతలకు మాత్రమే ఆధీనుడనైపోయిన నీ దాసుడను అంతే ! ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 ✍️ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏 #ఏయాజ్ఞఅయినబెట్టు #YEAGNAAYINAPETTU #PAVANCHARAN #JONNALAGADDASRIRAM #annamacharya #annamacharyakeerthanalu #annamayya #annamayyasongs #అన్నమయ్య #అన్నమాచార్య #annamayyakeerthanalu #annamayyakeerthana #annamayyaaksharavedam