Перейти к содержимому

శ్రీకృష్ణ దీపమాలికా పంచకం

పదకిరణాలు

0:00 / 0:00

శ్రీకృష్ణ దీపమాలికా పంచకం

5 просмотров · 4 ч назад
పదకిరణాలు
92 подписчика
5 просмотров · 4 ч назад
"Sri Krishna Deepamalika Panchakam" is an exquisite five-verse classical Telugu metrical prayer composed in the grand Utpalamala meter. Offering a luminous garland of verses at the lotus feet of Lord Krishna, this work traverses his enchanting childhood in Brindavan, his cosmic radiance celebrated by yogis, his playful leelas as the butter thief, his valor as the vanquisher of demons, and his supreme wisdom as the Gitacharya and charioteer of Partha. Immerse yourself in the metrical beauty, classical Telugu poetic grace, and divine devotion of Sri Krishna! #telugusongs #telugulyrics #srikrishna #srikrishnajanmastami #telugufilmsong #diwali #deepavali #deepavali2026 #Telugupoems #telugupoet #telugupoetry #telugupoetrylovers #Utpalamala Poems : Kondamudi Sai Kiran Kumar Music : Suno ఇప్పుడిప్పుడే వృత్తంలో పద్యాలు వ్రాస్తున్నా. తగు జాగ్రత్తలు తీసుకుంటున్నా. అయినా వ్యాకరణపరంగా, ఛందస్సుపరంగా, భాషాపరంగా అనుకోని తప్పులు కనబడితే క్షమించండి. Poems in Telugu ఉత్పలమాలలో పద్యాలు: నీలపు మేనితో వెలుగు, నెత్తిన పింఛము, పచ్చవల్వయున్, లీలగ చేతి వేణువును లెస్సగ నూదుచు మోహనంబుగన్, ఆలల మందలో, సఖుల యందున, గోపికలందు నొక్కడై బాలల రీతి నిల్చి బహుభక్తిని మ్రొక్కెద నా ముకుందునిన్! దీపపు వెల్గు సాటి యన దేజము జాలదు, హోమవహ్నియున్ జూపగ జాల దంతటిని, జూడగ గోటి రవుల్ సమానమే? రూపము లెన్ని జూచినను రూఢిగ దానె సమస్తమౌ గదా, తాపస యోగిసంతతుల ధ్యానమునన్ విలసిల్లు జ్యోతియే! చేతుల నిండ వెన్న గొని చేసెడి లీలల ముద్దులొల్కగన్, మాత యశోద జూడ దమి మాయల నవ్వుల ముంచివేయుచున్, మూతికి నంటినట్టి రుచి ముచ్చట గొల్పగ, వెన్నముద్దతో చేతము లన్నియున్ గొనిన చిత్తపు చోరుడు మా ముకుందుడే! దానవ నాశకుండయి ముదంబున దైత్యుల గూల్చు ధీరుడై, సూనృత ధర్మమున్ నిలిపి, సాధుల నెల్లర బ్రోచువాడె కాన్, మానస చేతనంబులను మాయలు చేసెడి షడ్వికారముల్ కానగ రాని రీతి నవి గాసిల, ముక్తి నొసంగు కృష్ణుడే! ధర్మవిమూఢుడౌ నరుని దారిని బెట్టగ, దివ్యబోధతోన్ నిర్మల గీత దెల్పి, భవనీరధి దాటెడు ధైర్యమిచ్చుచున్, కర్మఫలాభిలాష దగ గాదని పల్కిన జ్ఞానమూర్తియై, శర్మము గూర్చు పార్థరథసారథి నెప్పుడు గొల్తు నెమ్మదిన్!