Verokkaru leru viswamanta Annamayya sankeertana lyrics
Srinivasa Babu K
0:00 / 0:00
Verokkaru leru viswamanta Annamayya sankeertana lyrics
4 235 просмотров · 4 года назад
Srinivasa Babu K
1,45 тыс. подписчиков
4 235 просмотров · 4 года назад
అన్నమయ్య సంకీర్తన సంఖ్య 142 సంపుటం 15
గానము :శ్రీమతి ద్వారం లక్ష్మి గారు
వేరొక్కరూ లేరు విశ్వ మింతా నీమహిమే
యేరీతి నీవే కలవు యితరములేదు //పల్లవి //
తల్లివై రక్షింతువు తండ్రివై పోషింతువు
యిల్లాలివై మోహమిత్తువు నాకు
వొళ్లై పెరుగుదువు వొగి బురాకృత మౌదు
యిల్లు ముంగిలై వుందువింతా నీ మహిమే //వేరొక్క //
గురుడవై బోధింతువు కొడుకవై యీడేర్తువు
అరుదై నిధానము వౌదు నీవే
దొరవై నన్నేలుదువు దూతవై పని సేతువు
యిరవైన సిరు లిత్తు వింతా నీ మహిమే //వేరొక్క //
దేవుడవై పూజ గొందు దిక్కు ప్రాణ మౌదువు
కావలసిన ట్టౌదు కామించినట్లు
శ్రీ వేంకటేశ నీవే చిత్తములోపల నుండి
యీవల వైకుంఠ మిత్తు వింతా నీమహిమే //వేరొక్క //
vērokkarū lēru viśva mintā nīmahimē
yērīti nīvē kalavu yitaramulēdu
tallivai rakṣintuvu taṇḍrivai pōṣintuvu
yillālivai mōhamittuvu nāku
voḷlai peruguduvu vogi burākr̥ta maudu
yillu muṅgilai vunduvintā nī mahimē
guruḍavai bōdhintuvu koḍukavai yīḍērtuvu
arudai nidhānamu vaudu nīvē
doravai nannēluduvu dūtavai pani sētuvu
yiravaina siru littu vintā nī mahimē
dēvuḍavai pūja gondu dikku prāṇa mauduvu
kāvalasina ṭṭaudu kāmin̄cinaṭlu
śrī vēṅkaṭēśa nīvē cittamulōpala nuṇḍi
yīvala vaikuṇṭha mittu vintā nīmahimē