Перейти к содержимому

Inadayyee Kanidella Atu Annamayya sankeertana lyrics

Srinivasa Babu K

0:00 / 0:00

Inadayyee Kanidella Atu Annamayya sankeertana lyrics

1 660 просмотров · 5 лет назад
Srinivasa Babu K
1,45 тыс. подписчиков
1 660 просмотров · 5 лет назад
అన్నమయ్య సంకీర్తన సంఖ్య 9సంపుటం 3 రాగము :గౌరీమనోహరి /గానము :శ్రీ K సాకేత్ గారు స్వరకర్త :శ్రీ K రామాచారి గారు (SVBCTTD APP వారి సౌజన్యంతో ) ఐనదయ్యీ గానిదెల్లా నటు గాకుండితే మానీ మానుపరా దివి హరిమాయా మహిమలు     //పల్లవి // పుట్టేటి వెన్ని లేవు పోయేటి వెన్ని లేవు వెట్టి దేహాలు మోచినవెడజీవులు గట్టిగా దెలుసుకొంటే కలలోనివంటి దింతే పట్టి ఇందుకుగా నేల బడలేమో నేము      //ఐన // కడచిన వెన్ని లేవు కాచుకున్న వెన్ని లేవు సుడిగొన్న తనలోని సుఖదుఃఖాలు యెడపుల నివి రెండు యెండనీడవంటి వింతే కడనుండి నే మేలకరగేమో నేము           //ఐన // కోరినవి యెన్ని లేవు కోరగల వెన్ని లేవు తీరని సంపదలతో తెందేపలు ధారుణి శ్రీ వేంకటేశుదాసులమై యిన్నియును చేరి కైకొంటిమి యేమి సేసేమో నేము      //ఐన // ainadayyī gānidellā naṭu gākuṇḍitē mānī mānuparā divi harimāyā mahimalu     //pallavi// puṭṭēṭi venni lēvu pōyēṭi venni lēvu veṭṭi dēhālu mōcinaveḍajīvulu gaṭṭigā delusukoṇṭē kalalōnivaṇṭi dintē paṭṭi indukugā nēla baḍalēmō nēmu      //aina// kaḍacina venni lēvu kācukunna venni lēvu suḍigonna tanalōni sukhaduḥkhālu yeḍapula nivi reṇḍu yeṇḍanīḍavaṇṭi vintē kaḍanuṇḍi nē mēlakaragēmō nēmu    //aina// kōrinavi yenni lēvu kōragala venni lēvu tīrani sampadalatō tendēpalu dhāruṇi śrī vēṅkaṭēśudāsulamai yinniyunu cēri kaikoṇṭimi yēmi sēsēmō nēmu      //aina//