2021 New Year Song | నేను ఎరుగని త్రోవలో... | Nenu Yerugani.. | Holy Ministries | Bro Deevanaiah
Holy Ministries Official
0:00 / 0:00
2021 New Year Song | నేను ఎరుగని త్రోవలో... | Nenu Yerugani.. | Holy Ministries | Bro Deevanaiah
48 792 просмотра · 5 л. назад
Holy Ministries Official
24,4 тыс. подписчиков
48 792 просмотра · 5 л. назад
పల్లవి : నేను ఎరుగని త్రోవలో నన్ను నడిపిన యేసయ్య
నేనాత్మలో నీ అడుగు జాడలు గురుతుపట్టే కృపలనిచ్చి
రాజ మార్గములో నన్ను నడిపిన యేసయ్య
జ్యేష్ఠుల పరిశుద్ధ సంఘము నాకు యిచ్చితివి
1. నేను ఉన్నాను యేసయ్య నన్ను పంపుమయ్య
ఏ చోటుకైనా దేశమైనా నేను వెళ్ళెదను
విశ్వాస మార్గములో నీతో నడిచెద యేసయ్య
పోరాడెద ప్రార్థించుచు నీ పాదముల పై పడి
2. పశుల కాపరిని యేసయ్య ప్రవక్త జేసితివి
ఏ యోచననైన గ్రహింపునైన నీవే యిచ్చితివి
నీ సత్య మార్గములో సంతసించెద యేసయ్య
వాగ్దానములు నెరవేర్చుచుంటివి పరమకాపరివై
3. గొఱ్ఱెల కాపరిని యేసయ్య రాజు చేసితివి
ఏ యుద్ధమైన నా పక్షముగ నీవుండి జేసితివి
నీ నీతి మార్గములో నన్ను నిలిపి నడిపిన యేసయ్య
నన్ను కాచితివి నన్ను దాచితివి నీ రెక్కల నీడలో
4. మత్స్య జాలరిని ఆత్మల జాలరి జేసితివి
నిరాశలైన తుపానులైన నీవే అణచితివి
ఆశ్చర్య మార్గములు బయలుపరచిన యేసయ్య
నీ ఆత్మ కార్యములన్ని చూచు ధన్యత నిచ్చితివి
5. సువార్త శత్రువును యేసయ్య నీ శిష్యుని జేసితివి
ఏ సమయమైనను అసమయమైనను నీవే పంపితివి
సువార్త మార్గములో ఘన విజయమిచ్చిన యేసయ్య
రాజుల కు నిరుపేదలకు నన్ను మాదిరి జేసితివి