దిండిగల్ మటన్ బిర్యానీ | Dindigul Mutton Biryani in Telugu
HomeCookingTelugu
0:00 / 0:00
దిండిగల్ మటన్ బిర్యానీ | Dindigul Mutton Biryani in Telugu
72 945 просмотров · 6 л. назад
HomeCookingTelugu
269 тыс. подписчиков
72 945 просмотров · 6 л. назад
📌 Easy & Delicious Mutton Recipes : • Mutton Recipes | Easy & Authentic Indian M...
దిండిగల్ మటన్ బిర్యానీ, దిండిగల్ అనే ఒక ఊర్లో పుట్టిన స్పెషల్ బిర్యానీ. దీనిలో ప్రత్యేకమైన బియ్యం వాడతారు కాబట్టి చాలా కొత్తరకమైన టేస్ట్ ఉంటుంది. ఈ బిర్యానీని ఎలా చేయాలో ఈ వీడియోను చూసి తెలుసుకోండి.
#dindugalmuttonbiryani #teluguvantalu #biryanirecipes
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...
Here's the link to this recipe in English: https://bit.ly/37apL8s
తయారుచేయడానికి: 35 నిమిషాలు
వండటానికి: 1 గంట 30 నిమిషాలు
సెర్వింగులు: 5 - 6
కావలసిన పదార్థాలు
మటన్ - 1 కిలో
నీళ్లు - 1 1 / 2 కప్పులు
నూనె - 3 టేబుల్స్పూన్లు
నెయ్యి - 2 టేబుల్స్పూన్లు
పసుపు - 1 / 2 టీస్పూన్
ఎండుకారం - 1 టేబుల్స్పూన్
కల్లు ఉప్పు - 2 టీస్పూన్
ఒక చెక్క నిమ్మరసం
పెరుగు - 200 గ్రాములు
పుదీనా ఆకులు
కొత్తిమీర
జీరఁగ సాంబా బియ్యం
అరటి ఆకు
మసాలా పొడి చేయడానికి కావలసిన పదార్థాలు
ధనియాలు - 2 టేబుల్స్పూన్లు
జీడిపప్పులు - 10
జీలకర్ర - 1 టేబుల్స్పూన్
రాతి పువ్వు - 1 1 / 2 టేబుల్స్పూన్
యాలకులు - 6
మిరియాలు - 1 టేబుల్స్పూన్
బిర్యానీ ఆకులు - 2
అనాస పువ్వు - 2
దాల్చిన చెక్క
జాపత్రి
లవంగాలు - 10
జాజికాయ
సోంపు గింజలు - 1 టేబుల్స్పూన్
మసాలా పేస్ట్ చేయడానికి కావలసినవి
చిన్న ఉల్లిపాయలు - 15
పచ్చిమిరపకాయలు - 5
వెల్లుల్లి రెబ్బలు - 5
అల్లం
తయారుచేసే విధానం
ముందుగా మటన్ను ప్రెషర్ కుక్కరులో ఉడికించాలి
మసాలా పొడి చేసుకోడానికి పైన చెప్పిన మసాలా దినుసులన్నీ వేసి మెత్తటి పొడి పట్టుకోవాలి
మసాలా పేస్టు కోసం ఒక మిక్సీలో చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, అల్లం, పచ్చిమిరపకాయ, వేసి మెత్తటి పేస్టులాగా తయారుచేసుకోవాలి
ఇప్పుడొక పెద్ద పాత్రలో నెయ్యి, నూనె వేసుకోవాలి
ఇందులో తయారుచేసి పెట్టుకున్న మసాలా పేస్టును వేసి వేయించాలి
ఇందులో తయారుచేసి పెట్టుకున్న మసాలా పొడి, పసుపు, ఎండుకారం, కల్లుప్పు, వేసి వేయించుకోవాలి
ఇప్పుడు ఉడికించిన మటన్ ముక్కలను వేసుకుని, అందులో కొద్దిగా నిమ్మరసం, పెరుగు, వేసి కలుపుకోవాలి
పుదీనా ఆకులు, కొత్తిమీర వేసిన తరువాత మటన్ను ఉడికించగా మిగిలిన మటన్ స్టాక్ను ఇందులో వేసుకోవాలి
ఒక మూత పెట్టి 25 నిమిషాలు ఉడికించాలి
ఇప్పుడు సీరగ సంబ బియ్యాన్ని 20 నిమిషాల పాటు నీళ్ళల్లో నానపెట్టుకోవాలి
మటన్ చక్కగా ఉడికిన తరువాత నానపెట్టిన బియ్యాన్ని మటన్ మిశ్రమంలో వేసి, రెండు కప్పుల వేడి నీళ్లు పోసి, పొయ్యిని మీడియం ఫ్లేములో ఉంచి పది నిమిషాల పాటు బియ్యాన్ని సగం ఉడికించాలి
ఇప్పుడు ఒక పెనాన్ని వేడి చేసుకుని, బిర్యానీ వండిన గిన్నెను పెనం మీద పెట్టుకోవాలి
ఇందులో కొద్దిగా నెయ్యి, కొత్తిమీర, పుదీనా ఆకులు వేసి బాగా కలుపుకుని, ఒక అరిటాకుతో కప్పేయాలి
ఈ గిన్నె పైన ఫాయిల్ పేపర్తో మూసేసి, ఒక మూత పెట్టి, 20 నిమిషాల పాటు బిర్యానీని దంలో ఉడికించాలి
అంతే, దిండిగల్ మటన్ బిర్యానీ తయారైనట్టే, దీన్ని వేడివేడిగా రైతాతో కలిపి తింటే చాలా బాగుంటుంది
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - / homecookingtelugu
YOUTUBE: / homecookingtelugu
INSTAGRAM - / homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com