Перейти к содержимому

హారతి గైకొనవే జననీ Harati gaikonavea janani

Sreeradha Valiveti

0:00 / 0:00

హారతి గైకొనవే జననీ Harati gaikonavea janani

7 428 просмотров · 5 л. назад
Sreeradha Valiveti
2,49 тыс. подписчиков
7 428 просмотров · 5 л. назад
మంగళహారతి.. రచన...UVMవంశీ గారు హరతి గైకొనవే జననీ నీరజనాభుని ప్రియరమణీ హరతి గైకొనవే జననీ నీరజనాభుని ప్రియరమణీ హరతి గైకొనవే జననీ.. కలకలమను కళ గలిగిన శ్రీసతి మోమున దీపపు కాంతులవే చందన కుంద సుగంధ సుమమ్ములు ముత్తెపు సరములివే జననీ హరతి గైకొనవే జననీ నీరజనాభుని ప్రియరమణీ హరతి గైకొనవే జననీ.. కలువలరాయని సోదరివై ప్రియమొనరగ కమలాక్షునిరాణీ కలిమిలేములను కలగను రీతిగ కడ మము చేర్చగదే జననీ హరతి గైకొనవే జననీ నీరజనాభుని ప్రియరమణీ హరతి గైకొనవే జననీ.. కరముల వీణా పుస్తకధారిణి నాలుగు మోములవాని సఖి హరిగిరిజాపతి నారదసన్నుత గానవిలాసినివే జననీ హరతి గైకొనవే జననీ కమలసంభవుని అలివేణీ హరతి గైకొనవే జననీ.. కలరవముల కలహంసల వికసిత పంకజమధ్య విహారిణివే వీణాగాన సరస్వతి భారతి చతురానను రాణీ జననీ హరతి గైకొనవే జననీ కమలసంభవుని అలివేణీ హరతి గైకొనవే జననీ.. మదనునిసతిరతి శోకము దీర్చిన మంగళదాయిని శివతరుణీ సాంబశివుని సగభాగిని అయి సరినటనల ఆడెనదే జననీ హరతి గైకొనవే జననీ జయజగదీశ మనోహరిణీ హరతి గైకొనవే జననీ.. గజవదనుని శివతేజుని హరునితో కొలువై విలసెను హైమవతి అజనీరజనాభుడు అమరేంద్రుడు కొలువగ వచ్చెనదే జననీ హరతి గైకొనవే జననీ జయజగదీశ మనోహరిణీ హరతి గైకొనవే జననీ.. ముగురమ్మల మూలపుటమ్మకునివే జయమగు మంగళహారతులు మోహన గానసుధా రసధారల సుస్వర సుమములివే జననీ హరతి గైకొనవే జననీ త్రిభువనకారిణి భవతరణి హరతి గైకొనవే జననీ జయజగదీశ మనోహరిణీ హరతి గైకొనవే జననీ కమలసంభవుని అలివేణీ హరతి గైకొనవే జననీ నీరజనాభుని ప్రియరమణీ హరతి గైకొనవే జననీ.. హరతి గైకొనవే జననీ.. హరతి గైకొనవే జననీ..