Перейти к содержимому

పట్టుదలతో ప్రార్థించండి | Oct 8th దివ్య బలి పూజ పఠణములు | todays holymass readings | Luke 11:5-13

Pavithra vaani

0:00 / 0:00

పట్టుదలతో ప్రార్థించండి | Oct 8th దివ్య బలి పూజ పఠణములు | todays holymass readings | Luke 11:5-13

29 просмотров · 3 дня назад
Pavithra vaani
34 подписчика
29 просмотров · 3 дня назад
ఈనాటి పవిత్ర దివ్యవాక్య పఠనములు, ఆధ్యాత్మిక ధ్యానము మరియు శక్తివంతమైన ప్రార్థన.  మొదటి పఠనము: గలతీయులు 3: 1-5  భక్తి కీర్తన: లూకా సువార్త 1: 69-70, 71-72, 73-75  సువిశేష పఠనము: లూకా సువార్త 11: 5-13  మొదటి పఠనము: పునీత చిన్నప్ప గలతీయులకు వ్రాసిన లేఖ 3: 1-5 1. అవివేకులగు గలతీయులారా! మీరు ఎవని మాయకు లోనైతిరి? సిలువపై యేసు క్రీస్తు మరణము మీ కన్నుల యెదుట ప్రత్యక్షము చేయబడినదిగదా! 2. ఈ ఒక్క విషయము మీ నుండి అడగగోరుచున్నాను. ధర్మశాస్త్రము ఆజ్ఞాపించు దానిని చేయుటవలన మీరు దేవుని ఆత్మను పొందితిరా లేక విశ్వాసముతో వినుట వలననా? 3. మీరు ఇంత మూర్ఖులా ! మీరు దేవుని ఆత్మతో ఆరంభించి శరీరముతో ముగించుచున్నారా? 4. మీ అనుభవమంత నిష్ప్రయోజనమేనా? అది నిజముగ నిష్ప్రయోజనమైనచో, 5. దేవుడు మీకు ఆత్మనొసగి, మీ మధ్యలో అద్భుతములు చేయుట మీరు ధర్మశాస్త్రమును అనుసరించుట చేతనేనా? విశ్వాసముతో వినుట వలననా? భక్తి కీర్తన: లూకా 1:69-75 అందరు: ప్రభువగు యిస్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఏలయన, ఆయన తన ప్రజలకు చేయూతనిచ్చి వారిని విముక్తులను చేసెను. అల్లెలూయా: యోహాను 14:6  అల్లెలూయా! అల్లెలూయా! నేనే మార్గము, సత్యము, జీవము. నా మూలమున తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాలేడు అల్లెలూయా! సువిశేష పఠనము : పునీత లూకా సువార్త 11:5-13 5. యేసు ఇంకను వారితో ఇట్లు పలికెను: "మీలో ఒకడు అర్థరాత్రి వేళ తన మిత్రుని యొద్దకు వెళ్లి ఇట్లు చెప్పె ననుకొనుడు. మిత్రమా! నీవు నాకు మూడు రొట్టెలు బదులు ఇమ్ము. 6. నా స్నేహితుడు ఒకడు ప్రయాణమై పోవుచు, నా ఇంటికి వచ్చి ఉన్నాడు. అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియు లేదు." 7. అపుడు ఆ మిత్రుడు లోపల నుండి “నన్ను తొందర చేయకుము. తలుపులు మూసి ఉన్నవి. పిల్లలు నా యొద్ద పక్కమీద ఉన్నారు. నేను ఇప్పుడు లేచి ఇయ్యజాలను అని సమాధానము ఇచ్చెనను కొనుడు. 8. నేను మీతో చెప్పునది ఏమన, అతడు మిత్రుడై ఉండి లేచి ఏమి ఈయక పోయిన, పదేపదే ప్రాధేయపడి అడిగి నందున లేచి అతని అవసరము తీర్చును. 9. అట్లే అడుగుడు మీకు అనుగ్రహింప బడును. వెదకుడు మీకు దొరకును. తట్టుడు, మీకు తెరవబడును. 10. అడిగిన ప్రతివానికి ఇవ్వబడును . వెదకు వానికి దొరకును. తట్టువానికి తెరవబడును అని మీతో చెప్పుచున్నాను. 11. మీలో ఏ తండ్రియైన, కుమారుడు చేపను అడిగినచో పామునిచ్చునా? 12. గ్రుడ్డును అడిగినచో తేలును ఇచ్చునా? 13. మీరు ఎంత చెడ్డవారైన మీ బిడ్డలకు మంచి వస్తువులను ఇచ్చుట మీకు తెలియునుగదా! పరలోకమందున్న మీ తండ్రి తనను అడుగు వారికి ఇంక ఎంతగ పవిత్రాత్మను ఇచ్చునో ఊహింపుడు." క్రీస్తునందు ప్రియమైన సహోదరీ సహోదరులారా, ఈనాటి సువిశేషంలో ప్రభువైన యేసు మనకు పట్టుదలతో ప్రార్థించడం గురించి మరియు పరలోక తండ్రి ప్రేమ గురించి బోధిస్తున్నారు. ఈ వాక్యాన్ని వినండి, ధ్యానించండి మరియు ఇతరులతో పంచుకోండి. దైవాశీస్సులు మీ అందరికీ కలుగును గాక! ఆమేన్. 🔔 మరిన్ని అనుదిన దివ్యవాక్యాల కోసం మా ఛానెల్‌ని సబ్‌స్క్రైబ్ చేయండి! #dailycatholicreadings #todaysmassreadings #todayscatholicgospelreading #catholicbible #catholictelugu #DailyGospelTelugu #TeluguCatholicMass #TeluguBibleReadings #Luke11 #DailyPrayerTelugu #Pavithravaani #October8Readings #27thWeekOrdinaryTime #TeluguReadings #Galatians3 #Luke11 #RosaryMonth ​#TeluguCatholicReadings ​#TeluguBibleVerse