Перейти к содержимому

260822 డా. గుంటుపల్లి గారు: తెలుగు పిల్లలకు - తెలుగు చదవడం, రాయడం ఎందుకు రావడం లేదు?

తెలుగు కూటమి

0:00 / 0:00

260822 డా. గుంటుపల్లి గారు: తెలుగు పిల్లలకు - తెలుగు చదవడం, రాయడం ఎందుకు రావడం లేదు?

98 просмотров · 2 мес. назад
తెలుగు కూటమి
606 подписчиков
98 просмотров · 2 мес. назад
ప్రియమైన నేస్తాలకు, పిలుపు - తెలుగు కూటమి 151వ రచ్చబండ ” పలు సామాజిక అంశాలపై పోరాడుతున్న అలుపెరుగని జోదు - పోరాడనిదే గుంటుపల్లి వారికి పొద్దు పోదు ” ______________________________________ సాధారణ గ్రామీణ వ్యవసాయ కుటుంబంలో పుట్టి , పాఠశాల విద్య మొత్తం తెలుగు మాధ్యమంలోనే చదివి, వైద్యశాస్త్రం లో ఉన్నత స్థాయి పట్టాలు పుచ్చుకుని , చదువుల క్రమబద్దీకరణకు, మాతృభాష పరిరక్షణకు పెట్టనికోట గా మారిన వైద్యులు వీరు . _____________________________ పాఠశాల స్థాయిలో మాతృభాషా మాధ్యమంలో విద్య అందితేనే , అన్ని వర్గాల వారికి ఉన్నత విద్య మరియు ఉపాధి అవకాశాలు సమానంగా అందుతాయన్న ప్రగాఢ విశ్వాసం తో “పాఠశాల విద్యలో మాతృ భాషా మాధ్యమ పరిరక్షణకు న్యాయపోరాటం” చేస్తున్నారు. వృత్తిలో పైకి ఎదగడానికి, మనం బతికే తీరును బాగు చేసుకోవడానికి కేవలం ఆంగ్ల మాధ్యమంలో చదవడమే కారణమనే అపోహను తొలగించేందుకు పలు గణాంకాలతో పాటు పడుతున్నారు. _____________________________ ఏలూరు లోని ఆశ్రమ్ వైద్య కళాశాలలో జనరల్ మెడిసిన్ విభాగంలో ప్రొఫెసర్ గా పనిచేస్తున్న డా॥గుంటుపల్లి శ్రీనివాస్ గారు మన తెలుగు కూటమి వేదిక పై శనివారం, 22-08-2026, మాపులు 7 గం. లకు జరిపే *151వ రచ్చబండలో*, *తెలుగు పిల్లలకు - తెలుగు చదవడం, రాయడం .. ఎందుకు రావడం లేదు? అనే ఊసుని మనతో పంచుకుంటారు. ———————- సమావేశంలో పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి. వీడియో కాల్ లింక్: https://meet.google.com/ste-jdoz-xbs ——- ఎటువంటి దాటుమాట(పాస్వర్డ్) వాడే పని లేదు. ______________________ తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని), పురాణం రామప్రసాద్ , ఊరట వంౘ మరకాను(రసాయన సాంకేతిక యంత్రశాస్త్రం) చేపలుకు : 9505255100 telugukootami.org తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం. ================