261024 మంగారి రాజేందర్: తెలుగులో న్యాయపాలన ఎప్పుడో?
తెలుగు కూటమి
0:00 / 0:00
261024 మంగారి రాజేందర్: తెలుగులో న్యాయపాలన ఎప్పుడో?
37 просмотров · 5 дн. назад
తెలుగు కూటమి
606 подписчиков
37 просмотров · 5 дн. назад
ప్రియమైన నేస్తాలకు,
పిలుపు - తెలుగు కూటమి 155వ రచ్చబండ
”మానవ హక్కుల పరిరక్షణలో పట్టు విడువని మంగారి- పాలనలో తెలుగు అమలుకై పట్టు సడలని తగవరి”
______________________
వృత్తిరీత్యా న్యాయమూర్తిగా చట్టాన్ని నమ్మిన వీరు , ప్రవృత్తిగా అక్షరాన్ని ఆయుధంగా చేసుకున్నారు. సమాజంలోని బాధలను, అన్యాయాలను ఎండగట్టారు. ప్రజలకు అర్థమయేలా న్యాయస్థానాల తీర్పులను తెలుగులో వెలువరించారు.
———————————-
నాకు మానసిక ప్రశాంతతను ఇచ్చింది సాహిత్యమే,
అంటారు వీరు. తెలంగాణ జుడిషియల్ అకాడెమీ సంచాలకులుగా(రెండు సార్లు), తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమీషన్ సభ్యులుగా పనిచేసిన వీరు ప్రస్తుతం న్యాయవాదిగా , చట్టపరమైన తగవుల
ఆర్బిట్రేటర్ గా చురుకుగా కదులుతున్నారు. జ్యుడియషియల్ అకాడెమి డైరెక్టర్ గా వున్నప్పుడు చాలా మంది న్యాయమూర్తులు తెలుగు లో తీర్పులు చెప్పడానికి స్ఫూర్తి ని ఇచ్చారు.
————————————-
యాభై కి పైగా న్యాయశాస్త్ర పుస్తకాలను తెలుగు లోనికి అనువదించారు. పలు న్యాయశాస్త్ర సంబంధిత వ్యాసాలు రాశారు. ఎఫ్ ఐ ఆర్, హ్యూమన్ రైట్స్, రైట్స్ ఆఫ్ ప్రిజనర్స్, నోట్స్ ఆన్ ఎవిడెన్స్, - వీరి కొన్ని ప్రముఖ న్యాయశాస్త్ర పరిజ్ఞాన రచనలు. ఇవి ప్రజల్లో న్యాయవ్యవస్థ పై అవగాహన పెంచాయి. పలు మానవ హక్కుల పరిరక్షణ పోరాటాలకి దన్నుగా నిలిచాయి.
——————————————-
హాజర్ హై, రెండక్షరాలు, లోపలి వర్షం, ఒక్క కేసు చాలు, చూస్తుండగానే, ఒకప్పుడు మొదలైన కవితా సంపుటాలు, జింబో కథలు, మా వేములవాడ కథలు, నేనూ…నా నల్లకోటు, ఒక చిన్నమాట, రూల్ ఆఫ్ లా* మొ॥కథా సంపుటాలు వీరికి తెలుగు సాహిత్యంపై ఉన్న మక్కువను పట్టి చూపిస్తాయి.
——————————
తెలంగాణ రాష్ట్రానికి చెందిన విశ్రాంత జిల్లా న్యాయాధికారి, తెలుగు కవి , కథకులు, విమర్శకులు మంగారి రాజేందర్ ‘జింబో’ గారు మన తెలుగు కూటమి వేదిక పై శనివారం, 24-10-2026, మాపులు 7 గం. లకు జరిపే 155వ రచ్చబండలో*, *తెలుగులో న్యాయపాలన ఎప్పుడో? అనే ఊసుని మనతో పంచుకుంటారు.
———————————
సమావేశంలో పాల్గొనటానికి ఎప్పటి లాగా ఈ క్రింది లంకెపై నొక్కండి.
వీడియో కాల్ లింక్:
https://meet.google.com/ste-jdoz-xbs
——-
ఎటువంటి దాటుమాట(పాస్వర్డ్) వాడే పని లేదు.
______________________
తెలుగు నుడి ఊడిగంలో మీ అనుగరి(అభిమాని),
పురాణం రామప్రసాద్ ,
ఊరట వంౘ మరకాను(రసాయన సాంకేతిక యంత్రశాస్త్రం)
చేపలుకు : 9505255100
telugukootami.org
తెలుగును బతికించుకోవాలంటే తెలుగు భాషా ప్రాధికార సంస్థ ఏర్పాటు తో పాటు 1. ప్రతి కొలువుకు తెలుగులోనే పరీక్ష పెట్టాలనీ 2. ప్రతి బడి/కళాశాలలో తెలుగును ఒక తప్పనిసరి మందల [విషయం] గా నేర్పాలని 3. ఇతర రాష్ట్రాల్లో/దేశాల్లో ఉన్న తెలుగు వారికి తెలుగు చదివే వీలు మనం కలిగించాలని 4. అన్ని రాష్ట్రాల్లోనూ చనిపోతున్న తెలుగు మాటలను సేకరించి బతికించుకోవాలని, వాడాలని మనం జరుపుతున్న ఎసపు [ఉద్యమం] లో మీరు చురుకుగా పాల్గొనాలని విన్నపం.
================