Перейти к содержимому

సూళ్లూరుపేట పట్టణ పుర వీధులలో కూటమి అభ్యర్థుల ప్రచార జోరు - పాల్గొన్న MLA విజయశ్రీ

SS NEWS SULLURPETA

0:00 / 0:00

సూళ్లూరుపేట పట్టణ పుర వీధులలో కూటమి అభ్యర్థుల ప్రచార జోరు - పాల్గొన్న MLA విజయశ్రీ

789 просмотров · 9 ч назад
SS NEWS SULLURPETA
5,56 тыс. подписчиков
789 просмотров · 9 ч назад
సూళ్లూరుపేట మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కూటమి పార్టీలు కదం తొక్కాయి. నవంబర్ ఒకటో తేదీన జరగబోవు మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కూటమి పార్టీలకు చెందిన అభ్యర్థులు ఆయా వార్డుల్లో ప్రచారంలో ఇప్పటికే దూసుకెళ్తున్నారు. ఈ ప్రచార కార్యక్రమంలో భాగంగా సూళ్లూరుపేట పట్టణంలోని 19 , 20 ,21 వార్డులకు సంబంధించి కచేరి వీధి, బాపూజీ వీధి, పాండురంగ స్వామి స్ట్రీట్ , గాండ్ల వీధి మరియు బజారు వీధుల్లో ఎమ్మెల్యే విజయశ్రీ ఆధ్వర్యంలో, చైర్మన్ అభ్యర్థి పిట్ల సుహాసినితో పాటు 19 వ వార్డుకు పోటీ చేస్తున్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థి నూతలపాటి శ్రీనివాసరావు, 20వ వార్డులో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అలవల శ్రీనివాసులు మరియు 21 వ వార్డుకు పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి పోలూరు రాధాకృష్ణ ను అత్యధిక మెజార్టీతో మున్సిపల్ ఎన్నికలలో గెలిపించమని గడప గడపకు వెళ్లి ఓటర్లను అభ్యర్థించారు. ఇంతే కాకుండా బజారు వీధిలోని ప్రతి షాప్ కి వెళ్ళి వ్యాపారస్తులకు కరపత్రాలు పంపిణీ చేసి, సూళ్లూరుపేట పట్టణం మరింత అభివృద్ధి చెందాలంటే కూటమి పార్టీల అభ్యర్థులను గెలిపించమని ఎమ్మెల్యే విజయశ్రీ ఓటర్లను కోరారు. అనంతరం టవర్ క్లాక్ సెంటర్ వద్ద ఎమ్మెల్యే విజయశ్రీ మాట్లాడుతూ కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంతో పాటు సూళ్లూరుపేటలో తెలుగుదేశం పార్టీ చైర్మన్ అభ్యర్థి పిట్ల సుహాసిని ను గెలిపిస్తే, ట్రిపుల్ ఇంజన్ సర్కార్ లా పట్టణ అభివృద్ధికి పనిచేస్తారని ఆమె ఓటర్లకు తెలియజేశారు అంతేకాకుండా గత వైసిపి ప్రభుత్వం లో కేవలం అరాచకం తప్ప అభివృద్ధి ఎక్కడా లేదని కూటమి పార్టీల అభివృద్ధిని మనం గెలిపించుకుంటే సూళ్లూరుపేట పట్టణాన్ని సుందరీకరణగా తీర్చిదిద్దుకోవచ్చని ఆమె అన్నారు. ఈ ప్రచారంలో సూళ్లూరుపేట ఏఎంసీ చైర్మన్ ఆకుతోట రమేష్, శ్రీ చెంగాలమ్మ ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ తిరుమూరు సుధాకర్ రెడ్డి, ఈవీవీ సురేష్ , దంతాల రవి, భారతీయ జనతా పార్టీ నాయకులు తన్నీరు శేషగిరిరావు, DTDC శ్రీనివాసులు రెడ్డి , జనసేన పార్టీ నాయకులు మా భాష తదితరు నేతలు పాల్గొన్నారు.