తెలుగు సాహిత్యాభిమానులకు మహోత్సవం,, యావత్తు తెలుగు జాతికి గర్వ కారణం - పుష్పవిలాపం
Nyshadham
0:00 / 0:00
తెలుగు సాహిత్యాభిమానులకు మహోత్సవం,, యావత్తు తెలుగు జాతికి గర్వ కారణం - పుష్పవిలాపం
3 186 просмотров · 8 дней назад
Nyshadham
92 подписчика
3 186 просмотров · 8 дней назад
తెలుగు సాహిత్యాభిమానులకు మహోత్సవం, సంగీతాభిమానులను గొప్ప వీనుల విందు, యావత్తు తెలుగు జాతికి గర్వ కారణం - పుష్పవిలాపం గీతానికి స్వాగతం.
ఈ గీతం విన్న తరువాత పూలు కొయ్యాలంటే మనస్సు చివుక్కుమని, కొయ్య బుద్ధి కాదు.
పుష్పవిలాపం అనేది కరుణాశ్రీగా ప్రసిద్ధి చెందిన ప్రఖ్యాత కవి జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన ఒక ప్రముఖ తెలుగు కావ్యం.
ఇది పాపయ్య చెప్పిన మన పాపాల చిట్టా.
ఒక భక్తుడు పూజ కోసం పువ్వులు కోయడానికి తెల్లవారుజామున తోటకి వెళ్తాడు.అతను వాటిని కోయడానికి చేయి చాచగానే, పుష్పాలు భోరున విలపిస్తాయి. తమ దుఃఖాన్ని, వేదనను వ్యక్తపరుస్తాయి.వాటిని మాతృ మొక్క నుండి వేరు చేసి, వాటి స్వేచ్ఛను హరించి, సూదులతో గుండెల్లో గుచ్చి, దారాలతో ఉరి వేసి, ఉపయోగం తర్వాత మూల పారవేసి, చీపురుతో ఊడ్చి, చెత్తలో పడేసే మానవుల క్రూరత్వాన్ని అవి ప్రశ్నిస్తాయి.ఈ కవిత విశ్వ కరుణను చాటిచెబుతూ, అమాయక ప్రాణాల నాశనానికి దారితీసే ప్రార్థన దేవుడిని ఎలా సంతోషపెట్టగలదని పూలు ప్రశ్నిస్థాయి.
సాధారణ మనుష్యులు ఆలోచించలేని విధంగా, అనూహ్యంగా, పూల వైపు నుండి కవి ఆలోచించాడు.
రవి గాంచనిదే కవి గాంచును కదా!
ఘంటసాల ఈ గీతం పాడిన తర్వాతే పుష్పవిలాపం కావ్యం గురించి ఎక్కువ మందికి తెలిసింది.
ఎందుకంటే బంగారానికి తావి అప్పుడే అబ్బింది కనక!
ఇక కవి ఆవిష్కరించిన మొక్కల మనోగతాన్ని విందామా?
వాటి బాధను సానుభూతితో మనము గూడా పంచుకుందామా?
*********************************
నీ పూజ కోసం పూలు కోసుకొద్దామని ప్రొద్దున్నే మా తోటలోకి వెళ్ళాను ప్రభూ ఉదయశ్రీ అరుణారుణ కాంతుల్లో, ఉద్యానం కలకలలాడుతోంది పూల బాలలు తల్లి ఒడిలో అల్లారు ముద్దుగా ఆడుకుంటున్నాయి. అప్పుడు
నేనొక పూల మొక్క కడ నిల్చి, చివాలున కొమ్మవంచి
గోరానెడు నంతలోన విరులన్నియు జాలిగ
నోళ్ళు విప్పి, మా ప్రాణము తీతువాయనుచు
బావురుమన్నవి కృంగిపోతి నా
మానసమందేదో తళుకు మన్నది పుష్పవిలాప కావ్యమై
అంతలో ఒక సన్నజాజికన్నె సన్నని గొంతుకతో నన్ను చూసి యిలా అన్నది ప్రభు
ఆయువుగల్గు నాల్గు గడియల్ కనిపెంచిన తీవతల్లి
జాతీయత దిద్ది తీర్తుము తదీయ కరమ్ములలోన
స్వేచ్చ్చమై నూయల లూగుచున్ మురియుచుందుము
ఆయువు తీరినంతనే హాయిగ కన్ను మూసెదము
ఆయమ చల్లని కాలి వ్రేళ్ళపై
ఎందుకయ్యా మా స్వేచ్చ జీవనానికి అడ్డు వస్తావు మేము నీకేం అపకారము చేసాము
గాలిని గౌరవింతుము సుగంధము పూసి
మమ్మాశ్రయించు బృంగాలకు విందు చేసెదము
కమ్మని తేనెలు మిమ్ముబోంట్ల నేత్రాలకు హాయి
గూర్తుము స్వతంత్రుల మమ్ముల స్వార్ధబుద్ధితో తాలుము
త్రుంప బోకుము తల్లికి బిడ్డకి వేరుచేతువే
***************************
యింతలో ఒక గులాబి బాల కోపంతో
మొగమంతా ఎర్రబడి యిలా అంది ప్రభూ..
ఊలు దారాలతో గొంతుకురి బిగించి గుండెలోనుండి
సూదులు గృచ్చి కూర్చి, ముడుచుకొందురు ముచ్చట
ముడుల మమ్ము అకట దయలేనివారు మీ యాడవారు
పాపం మీరు దయాదాక్షిణ్యాలుగల మానవులు కావోలునే
మా వెలలేని ముగ్ధసుకుమార సుగంధ మరంద మాధురీ
జీవితమెల్ల మీకై త్యజించి కృశించి నశించిపోయే
మా యౌవనమెల్ల కొల్లగొని ఆపై చీపురుతోడ చిమ్మి
మమ్మావల పారబోతురుగదా నరజాతికి నీతియున్నదా
వోయీ మానవుడా
బుద్ధదేవుని భూమిలో పుట్టినావు
సహజమగు ప్రేమ నీలోన చచ్చేనేమి
అందమును హత్య చేసెడి హంతకుండా
మైలపడిపోయెనోయి నీ మనుజ జన్మ
అని దూషించు పూలకన్నియల కోయలేక
వట్టిచేతులతో వచ్చిన నాయీ హృదయ కుసుమాంజలిని
గైకొని నాపై నీ కరుణశ్రీ రేఖలను ప్రసరింపుము ప్రభు.
ప్రభు...................
#ghantasala