నడివీధిలో బొమ్మ కాదు అంబేద్కర్...|| Dr. B. Ambedkar Jayanti Special Song 2026
Maddasani Madhilo
0:00 / 0:00
నడివీధిలో బొమ్మ కాదు అంబేద్కర్...|| Dr. B. Ambedkar Jayanti Special Song 2026
129 065 просмотров · 5 месяцев назад
Maddasani Madhilo
25,6 тыс. подписчиков
129 065 просмотров · 5 месяцев назад
జై భీమ్ స్పూర్తిని తెలంగాణ జానపద రీతిలో ప్రతిధ్వనించే శక్తివంతమైన ఆంథమ్ గీతం. డా. B. R. Ambedkar ఆశయాలు, సమానత్వ సందేశం, ప్రజా చైతన్య స్పూర్తితో రూపొందించిన ఈ గీతం ఉద్యమ గానం. వినండి, పంచుకోండి, జై భీమ్ సందేశాన్ని వ్యాప్తి చేయండి.
#JaiBhim #JaiBhimSong #Ambedkar #DrBRAmbedkar #TelanganaFolkSong #TeluguFolkAnthem #DalitAnthem #TeluguSongs #BhimAnthem #TelanganaJanapada #SocialJusticeSong #JaiBhimAnthem
Lyrics..
నడివీధిలో నిలబడిన నూరడుగుల బొమ్మ కాదు.. అంబేద్కర్...
ఆచరణకు నోచుకోని రోజు పలికే పేరు కాదు.. అంబేద్కర్...
ఓటు బ్యాంకు రాజకీయ దుష్టుల పూదండ కాదు.. అంబేద్కర్...
రిజర్వేషన్ పేరుతో కులాల కుంపట్లు కాదు.. అంబేద్కర్...
జై భీమ్ జై భీమ్ ఎగిరే శాంతి కపోతం
భారతరాజ్య నిర్మాణ ప్రగతి పతాకం
జై భీమ్ జై భీమ్ అది ఒక మంత్రం
జనజీవన జాగృతికి ఆ పలికే తంత్రం
అనిగిమనిగి ఉన్నోడి అంతరాత్మ అతను
అజ్ఞానం అనే చీకటిలో చిరు దీపం అతను...
ఆకలైతే ముద్ద కలిపే అమ్మ చేయి అతను
అనంత విశ్వప్రేమకు ఆలంబన అతను
వెలివేతకు పుట్టిన కలువ పువ్వు అతను
కడజాతుల కన్నీటి కలల సాగు అతను
కాలం ప్రవాహానికి ఎదురీదిన నావికుడు
కలమే ఆయుధంగా అక్షరాల సైనికుడు