Перейти к содержимому

Soapnut: The Crop That Changed My Life| కుంకుడుతో నాకు ఎంతో గుర్తింపు| 99481 11931

lokasani padmareddy

0:00 / 0:00

Soapnut: The Crop That Changed My Life| కుంకుడుతో నాకు ఎంతో గుర్తింపు| 99481 11931

6 304 просмотра · 9 дн. назад
lokasani padmareddy
648 подписчиков
6 304 просмотра · 9 дн. назад
నమస్కారం! నన్ను అభిమానించే రైతు సోదరులందరికీ, నా ప్రయాణాన్ని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికీ హృదయపూర్వక నమస్కారాలు. విజయదశమి శుభాకాంక్షలు. గత కొంతకాలంగా నా గురించి, నా వ్యవసాయం గురించి అనేక టీవీ ఛానళ్లలో, యూట్యూబ్ ఛానళ్లలో వీడియోలు వచ్చాయి. అనేక పత్రికల్లో కథనాలు ప్రచురితమయ్యాయి. ఎంతోమంది నన్ను ఇంటర్వ్యూ చేశారు. మా తోటను చూడటానికి లక్షలాది మంది సందర్శకులు వచ్చారు. వేలాదిమంది ఫోన్ చేసి అభినందించారు. తమ అభిమానాన్ని పంచుకున్నారు. నా అనుభవాలు తమకు ఉపయోగపడుతున్నాయని చెప్పారు. నిజంగా చెప్పాలంటే… మీ అందరి ప్రేమ, అభిమానం నాకు ఎంతో ఆనందాన్ని ఇచ్చాయి. అంతకంటే ఎక్కువ బాధ్యతను గుర్తు చేశాయి. నన్ను ఇంతగా ఆదరిస్తున్న మీ అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు చెప్పుకోవడం నా బాధ్యతగా భావిస్తున్నాను. నేను చేసిన పనిని నలుగురితో పంచుకోవడం వల్ల మరికొంతమంది రైతులకు ఉపయోగం కలుగుతోందంటే, అంతకంటే సంతోషం నాకు మరొకటి లేదు. నేను కూడా మీలాగే ఒక సాధారణ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన వ్యక్తినే. వ్యవసాయంలో ఎన్నో సమస్యలు ఉంటాయి. నీటి సమస్య మొదలుకొని... పెట్టుబడులు, కూలీల కొరత, పంటల ఎంపిక, మార్కెటింగ్‌ వరకు అనేక సమస్యలు సందేహాలు ఉన్నాయి. ఏ పంట వేస్తే భవిష్యత్తులో ఉపయోగకరంగా ఉంటుందో తెలుసుకోవాలనే ఆలోచన ప్రతి రైతుకూ ఉంటుంది. ఈ ప్రయాణంలో నేను నేర్చుకున్న విషయాలు, చేసిన ప్రయోగాలు, ఎదుర్కొన్న అనుభవాలు నా దగ్గరే ఉండిపోకూడదని భావిస్తున్నాను. అందుకే నా వ్యవసాయ క్షేత్రంలో చేసిన ప్రయత్నాలను మీ అందరితో పంచుకోవడం నిర్ణయించాను. మీ అందరి ఆదరణ వల్ల నా ప్రయాణం మరింత బాధ్యతాయుతంగా మారింది. కుంకుడు పంట — ఒక పంట మాత్రమే కాదు, ఒక కొత్త ఆలోచన నా వ్యవసాయ ప్రయాణంలో కుంకుడు పంటకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కుంకుడు గురించి చాలామందికి తెలుసు. కానీ దాని సాగు ఎలా చేయాలి? ఎలాంటి నేలలు అనుకూలం? మొక్కల మధ్య ఎంత దూరం ఉండాలి? మొక్కల పెరుగుదల ఎలా ఉంటుంది? పంట నుంచి ఆదాయం పొందడానికి ఏమేమి తెలుసుకోవాలి? మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి? ఇలాంటి విషయాలపై చాలామందికి ఇంకా స్పష్టమైన సమాచారం అవసరం. కుంకుడు పంట గురించి వచ్చిన ఆదరణతో, ఈ పంటను భవిష్యత్తులో ఒక అవకాశంగా పరిశీలిస్తున్న రైతులు కూడా ఉన్నారు. అయితే ఒక విషయం స్పష్టంగా చెప్పాలి. ఏ పంట అయినా అందరికీ ఒకే రకమైన ఫలితాలు ఇవ్వదు. నేల, వాతావరణం, నీటి లభ్యత, మొక్కల పెరుగుదల, మార్కెట్, నిర్వహణ ఖర్చులు వంటి అనేక అంశాలపై ఫలితాలు ఆధారపడి ఉంటాయి. అందుకే కేవలం ఆశలు కల్పించడం కాకుండా, కుంకుడు సాగులో నాకు తెలిసిన అనుభవాలను, సాధ్యమైనంతవరకు ఆచరణాత్మక సమాచారాన్ని మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ఇక నుంచి మన LPR Organics ఛానల్‌లో ప్రధానంగా కొన్ని ముఖ్యమైన అంశాలపై వీడియోలు తీసుకురాబోతున్నాం. అందులో కుంకుడు సాగు, పొలంలో వాన నీటి సంరక్షణ, చేనుచుట్టూ చెరువు, బోర్ల రీఛార్జ్, నీటికుంటల ఆవశ్యకత, బోరు మోటార్ల ఎంపిక, పైపుల ద్వారా ద్రవ రూప ఎరువుల సరఫరా వంటి అనేక అంశాలని ఈ ఛానల్ ద్వారా నా అనుభవాలని మీతో పంచుకుంటానని తెలియ చేస్తున్నాను. మన వ్యవసాయ అనుభవాలను పంచుకుందాం. ఒకరి నుంచి మరొకరం నేర్చుకుందాం. రైతులకు ఉపయోగపడే సమాచారాన్ని మరింతమందికి చేరవేద్దాం. మీ అందరికీ ధన్యవాదాలు. ఇది మీ LPR Organics ఛానల్. 99481 11931. నమస్కారం!