Перейти к содержимому

Game: అంకెల చక్రం

CRISP - Early Childhood Education

0:00 / 0:00

Game: అంకెల చక్రం

8 042 просмотра · 1 год назад
CRISP - Early Childhood Education
519 подписчиков
8 042 просмотра · 1 год назад
ఈ ఆట పిల్లల్లో సంఖ్యల గుర్తింపు మరియు లెక్కించే నైపుణ్యాన్ని పెంపొందిస్తుంది. పాట పాడుతూ, పరిగెత్తుతూ శారీరక చురుకుదనాన్ని పొందడంతో పాటు వేగంగా స్పందించే సామర్థ్యాన్ని కూడా అభివృద్ధి చేస్తుంది. పిల్లలు సమూహంగా పాల్గొనడం వలన జట్టు భావం, ఆనందం, సామాజిక మరియు భావోద్వేగ నైపుణ్యాలు పెరుగుతాయి. అంకెల చక్రం విధానం 1. నేలపై మూడు వృత్తాలను చిత్రములో చూపిన విధంగా ఒక దాని లోపల ఒకటి దూరంగా గీయవలెను. 2. ఎంచుకున్న అంశాన్ని (సంఖ్యలు) ఎంత మంది విద్యార్థులతో ఆడించాలంటే అన్ని భాగాలుగా వృత్తాలను విభజించాలి. 3. లోపల వృత్తాన్ని ముందుగా తాకుతున్న ఒక్కొక్క గడిలో ఒక్కొక్క అంకెను రాయవలెను. 4. బయట వృత్తములో ఏర్పడిన గడులకు ఎదురుగా ఒక్కొక్క విద్యార్థిని నిలబెట్టి వృత్తంలోరాసిన ఒక్కొక్క అంకెకు సరిపడినన్ని పిక్కలను ఇవ్వవలెను. 5. టీచరు ఖంజరి సహాయంతో గడులలో ఉన్న ఏదోఒక అంకె గూర్చి పాట పాడుతూ వృత్తం చుట్టూ పిల్లలను పరిగెత్తించాలి. 6. పిల్లలు తిరుగుతున్న క్రమంలో టీచరు వృత్తములో ఉన్న అంకెలలో తాను పాడిన పాటకు సంబంధించిన అంకెను చెప్పగానే ఆ అంకెకు సరిపడు పిక్కలున్న విద్యార్ధి వచ్చి ఆ అంకెకు ఎదురుగా ఉన్న గడిలో పిక్కలను లెక్కిస్తూ పెట్టవలెను. మిగిలిన పిల్లలు వేరు వేరు గడులు దగ్గర నిలబడి ఉండాలి.