నవ్వుతూ బతకాలిరా 😊 | Navvuthu Bathakalira Telugu Folk Song | Life Changing Motivation | Manu Talks
Manu Talks
0:00 / 0:00
నవ్వుతూ బతకాలిరా 😊 | Navvuthu Bathakalira Telugu Folk Song | Life Changing Motivation | Manu Talks
361 457 просмотров · 2 месяца назад
Manu Talks
9,44 тыс. подписчиков
361 457 просмотров · 2 месяца назад
నవ్వుతూ బతకాలిరా... నవ్విస్తూనే ఉండాలిరా... ❤️
మనిషి జీవితం పుట్టుక నుండి చివరి ప్రయాణం వరకు ఎన్నో కష్టాలు, కన్నీళ్లు, బాధలు చూస్తుంది...
కానీ ఒక చిన్న నవ్వు మన బాధలను మర్చిపోయే గొప్ప శక్తి. 😊
"నవ్వుతూ బతకాలిరా" ఒక హృదయాన్ని తాకే తెలుగు జానపద గీతం.
ఈ పాట మనకు చెబుతుంది:
✨ కష్టాల్లో కూడా నవ్వుతూ ఉండాలి
✨ అసూయ, ద్వేషం వదిలేయాలి
✨ మన చుట్టూ ఉన్నవాళ్ల ఆనందమే నిజమైన సంతోషం
✨ కులం, డబ్బు, స్థాయి కన్నా మనిషితనం గొప్పది
😊 మన జీవితంలో ఎంత కష్టం వచ్చినా ఒక నవ్వుతో ఎదుర్కోవచ్చు...
ఈ పాటలో మీ మనసును తాకిన లైన్ ఏది? ❤️
మీ అభిప్రాయం కామెంట్ చేయండి 🙏
నచ్చితే మీకు ఇష్టమైన వాళ్లతో ఈ పాటను పంచుకోండి 😊
A soulful Telugu folk motivational song celebrating happiness, humanity, positivity and the beauty of simple village life.
Listen, smile and share happiness ❤️
🎧 Song: Navvuthu Bathakalira
🎼 Genre: Telugu Folk / Inspirational / Life Song
🎭 Theme: Happiness | Humanity | Positive Living
మీకు ఈ పాట నచ్చితే Like 👍 Share ❤️ Subscribe 🔔 చేయండి.
LYRICS:
నవ్వుతూ బతకాలిరా... నవ్విస్తూనే ఉండాలిరా...
ఏడుపుతో పుడతాము... ఏడిపిస్తూ ఎళ్ళిపోతాము...
ఈ రెండు ఏడుపుల నడుమన ఇంకేలరా బాధలు?
ఏదో రాలేదు, ఇంకేదో పోయింది అంటూ శోకాలు?
ఎన్ని కట్టాలున్నా, ఎంతటి గడ్డు కాలమైనా సరే
ఒక్కసారి నవ్వితే అవన్నీ అయి పోయేను పరారే
ఏడ్సుకుంటూ కూర్సుంటే నీకు ఏమి మిగిలేను
కళ్ళ నీళ్ళు అడ్డమొచ్చి ఎదటది కూడా మసకయ్యేను
దిగులనే దెయ్యాన్ని తరిమేసే గొప్ప శక్తి నవ్వేరా...
అందుకే... నవ్వుతూ బతకాలిరా... నవ్విస్తూనే ఉండాలిరా...
ఏడుపుతో పుడతాము... ఏడిపిస్తూ ఎళ్ళిపోతాము...
ఈ రెండు ఏడుపుల నడుమన ఇంకేలరా బాధలు?
ఏదో రాలేదు, ఇంకేదో పోయింది అంటూ శోకాలు?
పక్కోడు బాగుపడితే సూడలేక ఒకడికి ఏడుపు
ఎదటోడిని మెచ్చితే ఓర్వలేక మరోడికి ఏడుపు
మంచి అంటే మనం బాగా ఉంటే సరిపోదుగా
మన సుట్టూ ఉన్నోళ్ళంతా ఉండాలి ఆనందంగా
కీడు సేయకుంటె సాలు సేయవద్దు ఏ ఉపకారమే
అసయ్యించుకోకు సాలు సూపొద్దు మమకారమే
సిన్నోడైనా, గొప్పోడైనా ఆడు కూడా మనిసేగా
నోట్ల కట్టలున్నాయని కొమ్ములేమీ మొలవవుగా
ఉన్నంతలో పతి ఒక్కడు నవ్వుతూనే బతకాలిరా
అందుకే... నవ్వుతూ బతకాలిరా... నవ్విస్తూనే ఉండాలిరా...
ఏడుపుతో పుడతాము... ఏడిపిస్తూ ఎళ్ళిపోతాము...
ఈ రెండు ఏడుపుల నడుమన ఇంకేలరా బాధలు?
ఏదో రాలేదు, ఇంకేదో పోయింది అంటూ శోకాలు?
ఆ కులమూ, ఈ కులమూ... ఆ వర్గం, ఈ వర్గం...
ఏడ పుట్టుకొచ్చినాయో ఇయ్యన్నీ మందులేని పెద్ద రోగం
గొప్పలు సెప్పేటోళ్ళ ఇంటికాడ బాగోతాలు తెలియనివా?
ఆళ్ళ సొక్కా యెనక బనీనుకున్న బొక్కలెన్నొ సూడనివా?
జీవితాన బాదలు, కట్టాలు ఎవడికైనా ఉండేను ఒక్కతీరే
స్తిమితంగ ఉన్నోల్లే ఎన్నడైన తట్టుకుని సిక్కంగ నవ్వుతారె
సమస్య ఎట్టాంటిదైనా సరే పరిస్కారం ఉండేను తప్పక
ఏడ్సుకుంటు కూసోక నిమ్మలించి బుర్రకు పదునుపెట్టిక
నిరాశ నిను కమ్మినపుడు నీకు ఉండే నేస్తమె ఒక నవ్వు...
అందుకే... నవ్వుతూ బతకాలిరా... నవ్విస్తూనే ఉండాలిరా...
ఏడుపుతో పుడతాము... ఏడిపిస్తూ ఎళ్ళిపోతాము...
ఈ రెండు ఏడుపుల నడుమన ఇంకేలరా బాధలు?
ఏదో రాలేదు, ఇంకేదో పోయింది అంటూ శోకాలు?
#ManuTalks
#NavvuthuBathakalira
#TeluguFolkSong
#TeluguSongs2026
#MotivationalSong
#నవ్వుతూబతకాలిరా
#NavvuthuBathakalira
#TeluguFolkSong
#TeluguMotivationalSong
#TeluguVillageSong
#TeluguSongs2026
#TeluguFolk
#LifeChangingSong
#PositiveVibes
#SmileSong
#HumanitySong
#NewTeluguSong
ManuTalks, Manu Talks, navvuthu bathakalira,
navvuthu bathakalira song,
నవ్వుతూ బతకాలిరా,
telugu folk songs,
telugu folk songs 2026,
new telugu folk song,
telugu motivational songs,
life changing telugu songs,
heart touching telugu song,
telugu emotional songs,
telugu village songs,
telugu inspirational songs,
telugu life songs,
smile song telugu,
happy life song telugu,
telugu positive songs,
telugu humanity songs,
telugu philosophical songs,
telugu meaningful lyrics,
telugu janapada patalu,
janapada songs telugu,
telangana folk songs,
andhra folk songs,
rayalaseema folk songs,
village folk music telugu,
telugu family songs,
telugu moral songs,
telugu viral songs,
new telugu songs 2026,
trending telugu songs,
latest telugu songs,
folk music india,
indian village folk song
Welcome to Manu Talks.
I create original poetry and turn it into soulful songs — where emotions, stories, and melodies meet.
If you love expressive writing, raw lyrics, and music that speaks from the heart, you’ll feel at home here.
Subscribe and join me as I share new poems, acoustic versions, behind-the-scenes songwriting, and more.
Every video on this channel blends:
🎵 Meaningful lyrics
🗞️ Today’s trending topics
💭 Personal reflections and real stories
I take the moments, issues and emotions around us and express them in a musical, lyrical storytelling style — simple, honest, and always relatable.
No gossip. No unnecessary noise.
Just music with meaning and commentary with heart.
If you enjoy content that informs, inspires, and entertains through melody, you’re in the right place.
Subscribe to Manu Talks — where every story finds its rhythm.