Перейти к содержимому

మనిషి బ్రతుకు బానిస బ్రతుకే | భవబంధాలు, ఆశలు, భయాలు | తాత్విక గీతం | Seshachandracreations

Seshachandracreations

0:00 / 0:00

మనిషి బ్రతుకు బానిస బ్రతుకే | భవబంధాలు, ఆశలు, భయాలు | తాత్విక గీతం | Seshachandracreations

278 просмотров · 1 день назад
Seshachandracreations
276 подписчиков
278 просмотров · 1 день назад
మనిషి జీవితాన్ని ఎన్నో బంధాలు, ఆశలు, మోహాలు, భయాలు నడిపిస్తుంటాయి. పిల్లలపై ప్రేమతో తల్లిదండ్రులు వారి బాధలకు బానిసలవుతారు. ప్రేమలో ప్రేమికులు ఒకరికొకరు బానిసలవుతారు. భార్యాభర్తలు, ధనం, అధికారం, పదవి, సమాజం, ఇతరుల అభిప్రాయాలు, కోపం, ఈర్ష్య, మోహం, ఇంద్రియాలు, ఆశలు, భయాలు—ఇలా మనిషి తన జీవితంలో ఎన్నో బంధనాలకు లోనవుతుంటాడు. చివరికి తన మనసు చెప్పినట్టే నడుచుకుంటూ, తన మనసుకే బానిసగా మారుతున్నాడా? **“జీవకోటిలో మనిషొక్కడే బ్రతుకుతున్నాడు బానిసగా… ప్రతిదానికి విముక్తి లేక జీవితమంతా బానిస బ్రతుకు…”** అనే ఆలోచనతో రూపొందించిన ఈ తాత్విక గీతం మనిషి జీవితంలోని బంధనాలను ఆలోచింపజేసే ప్రయత్నం. ఓ మనిషి బ్రతికేవు భవబంధాలతో ఆశామోహాలతో భయభ్రాంతులతో బానిస బ్రతుకు ఏడ్చే పిల్లవాడికి మారాము చేసే పసివాడికి కొసరంతా దెబ్బ తగిలినా పిసిరంతా జబ్బుచేసినా విలవిలలాడే తల్లితండ్రులెప్పుడు పిల్లలకు... బానిసలే వలిచిన ప్రియురాలికి బానిసెప్పుడు ప్రేమికుడు....... బానిసకాదా ప్రేమికుడికి ప్రియురాలు మనసిస్తే …… సుగుణవతి బార్య ఎప్పుడు బానిసే మగడికి ..... మెతక మగడెప్పుడు బానిస..... గడుసు పెళ్లానికి ధనమున్న వాడికి లేని వాడు బానిసైతే.... ఆ ధనమున్న వాడు ఆ ధనానికి బానిస ఓటు వేసే వరకు ఓటరుకు బానిస నాయకుడు .. అడిగింది ఇస్తాడు చెప్పిదంతా చేస్తానంటాడు గెలిచాక చేసుకొంటాడు ఓటరును బానిసగా ...... అధికారానికి అడ్డుదారులు తొక్కేవాడెప్పుడు పదవికి బానిస .... ఇతరులు ఏమంటారోనని తన మనసును తాను చంపుకుంటూ లోకం మెచ్చాలని బ్రతికేవాడెప్పుడు లోకానికి బానిస.... కోపతాపాలకు ఈర్షారాగాలకు మోహావేశాలకు బందీ అయిన వాడెప్పుడు ఇంద్రియలకు బానిస చూసినదంతా కావాలని కావలసినదంతా పొందాలని తీరని కోరికల వలలో పడే మనిషెప్పుడు ఆశలకు బానిసే బలవంతుడికెప్పుడు బలహీనుడు బానిస ఎవరేమంటారో నేనా పనిచేయలేనేమో అది నా వల్ల కాదేమో అని బలహీన మనసుతో బ్రతికే వాడెప్పుడు భయానికి బానిస బలమైన జంతువు కూడా చావు భయంతో బ్రతుకుతుంది మనిషికి బానిసగా .... మనసు చేస్తుంది మనిషిని ..పశువుగా మాట వినని మనసుకు మనిషెప్పుడు బానిసే జీవకోటిలో మనిషొక్కడే బ్రతుకుతున్నాడు బానిసగా ప్రతిదానికి విముక్తి లేక జీవితమంతా బానిస బ్రతుకు ఈ పాట మీకు నచ్చితే Like చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి, మరిన్ని తెలుగు తాత్విక మరియు ఆధ్యాత్మిక గీతాల కోసం *Seshachandra Creations* ఛానల్‌ను Subscribe చేయండి. #బానిసబ్రతుకు #తెలుగుపాట #తాత్వికగీతం #SeshachandraCreations