Memu viduvamu kreestu margamu missionary song (మేము విడువము క్రీస్తు మార్గము) || SFJ SONGS ||
Soldiers For Jesus AP & TS
0:00 / 0:00
Memu viduvamu kreestu margamu missionary song (మేము విడువము క్రీస్తు మార్గము) || SFJ SONGS ||
37 205 просмотров · 2 г. назад
Soldiers For Jesus AP & TS
4,9 тыс. подписчиков
37 205 просмотров · 2 г. назад
#teluguchristiansongs #telugujesussongs #sfjchristiansongs
#sfjtelugu #latestchristiandevotionalsongs #nissyjohn
Credits:
Script: Bro. Mahesh SFJ
Tune: Bro. Pradeep
Composition: Bro. Mani Prakash.D
music: Sam Kiran
vocals: Nissy John
videography: Bro. Sagar
Lyrics:
మేము విడువము క్రీస్తు మార్గము - మేము మానము ప్రేమను చూపించడము - 2
మేలు చేయుటే క్రైస్తవ ధ్యేయము - త్యాగమయము మిషనరీల చరితము - 2
రువ్విన రాళ్లు రివ్వున వచ్చి రక్తం చిందిననూ
దూసిన కత్తి దూసుకు వచ్చి దేహాన్ని కోసిననూ
బల్లెం దించినను-బాణాలే చీల్చినను
ఖైదీగా చేసిననూ-మంటల్లో కాల్చినను iiమేము విడువముii
1. మదర్ థెరీసా కట్టిన నిలయాలను మరువము
ఐడా, బేరమ్మల వైద్య సేవలు విడువము
గ్లాడిస్ చూపించిన క్షమాపణను మరువము
హైనీ, కార్మికెల్ వారసులై నిలుతుము - 2
ఎన్ని కష్టాలైనా… ఎన్నడూ వెనుతిరుగనె లేదుగా
ఎన్ని ఖర్చులైనా… విశ్వాసమునే వీడ లేదుగా
కుష్ట రోగులకు ఔషధమై - అనాథలకు ఆశ్రయమై
బీద జనులకు అక్షరమై - అన్నార్తులకు ఆహారమై - 2
ఉన్నత దేశాల ఆడ బిడ్డలు - భారత దేశపు ప్రేమ మూర్తులయ్యెనుగా
వారి కుటుంబములను విడిచి - మన కుటుంబములను వెలిగించెనుగా iiమేము విడువముii
2. విలియం కేరీ బృందం త్యాగాలను మరువము
గ్రహం స్టెయిన్స్ కుటుంబపు ప్రేరణను విడువము
జీగెన్బెర్గ్, కాటన్ దొరల త్యాగ పథము విడువము
స్టడ్, జోన్స్, క్లౌ దొరల సేవలను మరువము – 2
కడలి తీరాలలో.... వీరి సాక్ష్యాలు కోకొల్లలుగా
నేటి విద్య వైద్య విధానాలే.... వారిచ్చిన ప్రేమ కానుకలేగా
చీకటి బతుకుల బాసటగా - అనాగరికుల ఆప్తులుగా
అబలల ఆశా జ్యోతులుగా – అభ్యున్నతికి ఆధారంగా – 2
ప్రాణాలు నిలుపుటకు వైద్యాలయాలను- భవిష్యత్ తరాలకు విద్యాలయాలను
దేహానికి ఆహారమును - ఆత్మలకు నిత్య జీవమును అందించిరిగా iiమేము విడువముii
3. ఉన్నత దేశాల వదలి వాక్యమందని చోట్లను వెలిగించుటకై వీరు తరలి రాలేదా!
పేద దేశమే వద్దు ధనిక దేశమే ముద్దని - లోక పోకడలు పోవుట ఎవరికైన తగునా! -2
పొరుగువారికై.......ప్రాణాలర్పించిరి నాటి శిష్యులు
స్వార్థ పూరితులై.... తమ కొరకే బ్రతుకు నేటి క్రైస్తవులు
యోగ్యులైనవారు తగ్గలేదా వారికున్నవన్నీ ఇచ్చివేయలేదా
యేసు ప్రేమ చూప దిగి రాలేదా సువార్తకై హతమవ్వలేదా – 2
మిషనరీల సేవలు పొందియు వారి భారమును విడువ తగునా?
ఆత్మల సంపాదనొదిలి ఆస్తులకై చేయు సేవను ప్రభు మెచ్చునా? ii మేము విడువముii
All rights are reserved with soldiers for Jesus Society, AP & TS
Script : Bro. Mahesh, SFJ
Tune : Bro. Pradeep, SFJ
Singers : Bro. Nissi John
Lyrics : Bro. Mani Prakash
Music: Bro. Syam Kiran
Video: Bro. Sagar
Production: Sis. Vijaya Kumari, SFJ