Organic Layer poultry Farm || Monthly 10 lakhs turnover, net income 2 lakhs per month
Raitu Nestham
0:00 / 0:00
Organic Layer poultry Farm || Monthly 10 lakhs turnover, net income 2 lakhs per month
352 338 просмотров · 8 лет назад
Raitu Nestham
1,41 млн подписчиков
352 338 просмотров · 8 лет назад
మంచి ఆరోగ్యాన్ని అందించే పోషక విలువలున్న ఆహార పదార్థాల్లో కోడిగుడ్డు అతిముఖ్యమైంది. ముఖ్యంగా చిన్నారులు, గర్భిణులు కోడిగుడ్లను ఆహారంగా తీసుకుంటే ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవని వైద్యులు చెబుతుంటారు. కానీ ఆహార పదార్థాలన్నీ రసాయనమయం అయిపోయిన ఈ రోజుల్లో శక్తినివ్వాల్సిన కోడిగుడ్లు కూడా అనారోగ్యానికి కారణమవుతున్నాయి. కోళ్లకు ఇచ్చే దాణా మొత్తం రసాయనాల మిశ్రమాలతో నిండి ఉండటంవల్ల అవి పెట్టే గుడ్లుకూడా విషతుల్యమవుతున్నాయి. వాటిని తినడంవల్ల పోషకవిలువలకు రసాయనాలు మన శరీరంలోకి చేరి కొత్తకొత్త అనారోగ్య సమస్యలు తెచ్చి పెడుతున్నాయి. ఈ పరిణామాలను గమనించిన ఓ మహిళా రైతు... ప్రకృతి సిద్ధంగా పండించిన దాణాను కోళ్లకు ఆహారంగా ఇస్తున్నారు. ఫలితంగా ఈ దాణా తింటున్న కోళ్లు పెట్టే గుడ్లలో పోషక విలువలు సమృద్ధిగా ఉంటున్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తకోట మండలం రాయన్‌పేటకు చెందిన జయప్రద ఐదేళ్లుగా ఈ పద్ధతిలోనే లేయర్ ఫామింగ్ నిర్వహిస్తున్నారు. ప్రతినెలా 40వేల రూపాయల నిర్వహణ ఖర్చుతో పదిలక్షల రూపాయల టర్నోవర్‌తో కోడిగుడ్ల వ్యాపారం చేస్తున్నారు.
జయప్రద
ph : 86394 21276