Перейти к содержимому

ఆదివాసీలు చేసిన పూర్వజన్మ పుణ్యమనీ..!Ex MLA Athram Sakku|Haimendorf & Betty Elizabeth Marlawi

The Thukaram Channel

0:00 / 0:00

ఆదివాసీలు చేసిన పూర్వజన్మ పుణ్యమనీ..!Ex MLA Athram Sakku|Haimendorf & Betty Elizabeth Marlawi

2 112 просмотров · 2 г. назад
The Thukaram Channel
7,6 тыс. подписчиков
2 112 просмотров · 2 г. назад
హైమండార్ప్ ఎలిజబెత్ దంపతులు మార్లవాయిగ్రామానికి వచ్చి ఆదివాసి ప్రాంతాలలో కలియతిరిగి నాటి బ్రిటిష్ ప్రభుత్వనికి అనేక రకాలైన నివేదికలు అందించారు, కుమ్రం భీం పోరాటంతో పాటు అనేక పోరాటలను అవలోకనం చేసి నాటి ప్రభుత్వనికి,నివేదికలను అందించిన ఆమె ఆదివాసుల ఆత్మీయ బంధువులు హైమండార్ప్ ఎలిజబెత్ దంపతులు అని ఆసిఫాబాద్ నియోజక వర్గ ఎమ్మెల్యే కోవ లక్ష్మి కొనియాడారు.బుధవారం హైమండార్ప్ ఎలిజబెత్ వర్థంతి కార్యక్రమాని నిర్వహించారు ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ &శిశుసంక్షేమ శాఖమంత్రి దనసరిసితక్క ముఖ్య అతిథిగా హాజరయ్యారు.హైమాండార్ప్ దంపతులు ఆదివాసీల కోసం ఎంతో కృషిచేసి ఆదివాసుల గుండెల్లో చెందింది చిరస్థాయిలో నిలిచారని మన ప్రాంతాలవారు కాదు మనజాతి వారు కాదు ,మన పేగుబంధం కాకున్నా మన జాతి కై ఎంతో శ్రమించరన్నారు,పుణ్యదంపతులు చేసిన సేవలు జాతికి ఎంతో మెలుచేశాయాని రాష్ట్రమంత్రి వర్యులు దనసరిసితక్క కొనియాడారు.వారి ఆశయాలను ,వారి స్ఫూర్తిని నేటి మన సమాజం గుర్తించి వారు సూచించిన అడుగుజాడల్లో నడవలన్నారు.ప్రభుత్వ పరంగా మా వంతుగా మార్లవాయి అభివృద్ధి కి,హైమండార్ప్ ఎలిజబెత్ దంపతుల ఆశయాలను తప్పక కోనసాగించేందుకు ప్రభుత్వపరంగా కృషిచేస్తాం అని ఆమె ఆమె తెలిపారు,ముందుగా ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లడారు గత ముఖ్యమంత్రి కేసిఆర్ ప్రభుత్వం నేతృత్వంలో, హైమండార్ప్ వర్ధంతిని ఐటిడిఏ నిధులు ద్వార ప్రతియోటా వర్ధంతి కార్యక్రమాని నిర్వహిస్తూ వస్తున్నామన్నారు,ఆ దంపతుల పేరిట గతంలో తాను 2కోట్లతో ట్యాంక్ బండ్,గ్రామంలో అనేక సీసీ రోడ్లు,వారి నివాసంతో పాటు,గుస్సాడికేంద్రం,కరిటెజ్ లను పర్యటకులకోసం నిర్మాణం చేపట్టేందుకు తాము కృషిచేయడంజరిగిందన్నారు,ఇతర అనేక మౌళిక వసతులు , సదుపాయాలకై కృషిచేశామని ఆమె తెలిపారు,మా ప్రభుత్వం హయాంలో ఆదివాసి సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీఠవేశమన్నారు మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ సహకారంతో గతంలో జోడేఘాట్, లోకుమ్రం భీం పేరిటా మ్యూజియం,నిలువెత్తు కాంస్య విగ్రహాన్ని, ఏర్పాటు చేశామన్నారు,జంగుబాయి దేవస్థానం పరందోళి,కేస్లాపూర్ నాగోభ జాతర,కాకోబాయిదేవుళ్ల కోసం నిధులను కేటాయించి ఆదివాసిల ఆత్మగౌరవని కాపాడమన ఇంక ఆమె గుర్తుచేశారు, గతంలో ఎన్నో ప్రభుత్వాలు ఉన్నా ఇలాంటివాటిని పట్టించుకున్నాపాపనపోలేదన్నారు,అదేవిధంగా భీం పోరాటా వీరుడి పేరిటా,కుమ్రం భీం జిల్లా ఏర్పాటు చేసి ఎన్నో జిల్లా కేంద్రంలో వైధ్యకళశాల,ఎన్నో పాఠశాలలు,కళాశాల,ప్రభుత్వం ఆధికారుల కార్యాలయాలను నిర్మాణం చేపట్టి ప్రజలపరిపాలన సౌలభ్యని కల్పించిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసిఆర్ కే దక్కిందన్నారు,అదేవిధంగా కేసిఆర్ ముఖ్యమంత్రి ఇంకఎన్నికల ముందు పంచాయితి రాజ్, ఆర్ &బి,పిఏంజిఏస్ వై,గిరిజన సంక్షేమ శాఖ ద్వార రోడ్లతో పాటు అనేక అభివృద్ధి పనులు జిల్లాలో మంజూరు చేశారని అట్టి పనులను త్వరితగతిన పూర్తి చేసేందుకు తాము ప్రయత్నించాలన్నారు అట్టి పనుల నిధులను వెనక్కి తీసుకోకుండ కృషిచేయాలని మంత్రిని ఆమె కోరారు.ఇంక అభివృద్ధి కి తప్పక నిధులను కేటాయించి ఆదివాసి జిల్లాలో ఉన్నా గ్రామాలలోని ఇంకకోన్ని సమస్యలను తమ దృష్టికి తీసుకొని వస్తాను అని అట్టి సమస్యలను పరిష్కరించాలని ఆమె కోరారు. సర్పంచుల కు గతంలో కేటాయించిన నిధులను అపవద్దని,వారికి గతంలో ఇచ్చిన గ్రామపంచాయితీ పనులనిధులను ఆపకుండ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకొని వెళ్లాలని ఆమె సూచించారు. అనంతరం ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మబోజ్జు మాట్లడుతూ...ఆదివాసీలకు మన ఉమ్మడి జిల్లాలో కూడా కూడా కూడా కేస్లాపూర్,జోడేఘాట్,మార్లవాయి,కాకోబాయి, వెదికలు ఉన్నాయని అవరైన వాటికై మరి వీటికి నిధులు కేటాయించి వీటిని అభివృద్ధి చేసేందుకు ముందుంటామని ,విటి నిధులను తప్పక తమ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆయన తెలిపారు,అదేవిధంగా గత ఏడాది జోడేఘాట్ వర్థంతినిధులు,జంగుబాయి పరందోళి నిధులు,గుస్సాడి దండారి నిధులు ఇప్పటికి రాలేదు అని తప్పక నిధులను త్వరితగతిన వాటికి సంబంధించిన నిధులను అందించాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాఇంచార్జీ మంత్రివర్యులు సితక్కను ఆయన కోరారు.అనంతరం కుమ్రం భీం జిల్లా రాయి సెంటర్ కమిటి సభ్యులు కోవ లక్ష్మి హయాంలో పలు డిమాండ్ లతో కూడిన విపతి పత్రని మంత్రివర్యులు అందజేశారు.ముందుగా మంత్రివర్యులను , ఎమ్మెల్యే లను ,అధికారులను సంప్రదాయగుస్సాడిడేంసా నృత్యాలతో గ్రామస్తులు స్వాగతం పలికారు కాగ హైమండార్ప్ దంపతులు విగ్రహాలకు పూలమాలలు వేశారు అనంతరం హైమండార్ప్ ఎలిజబెత్ దంపతుల పేరిటా హైమండార్ప్ యాది అనే మ్యూజియం భవనం ని రిబేన్ కట్ చేసి ప్రారంబించారు#Marlawi#Asifabad#thethukaramchannel#tribelife#Gondslife#interview#adivasi