Перейти к содержимому

Samudra Vasane Devi - Slokam meaning as Song/ Video 668/సముద్రవసనే దేవి, పర్వతస్థనమండలే

ARTA

0:00 / 0:00

Samudra Vasane Devi - Slokam meaning as Song/ Video 668/సముద్రవసనే దేవి, పర్వతస్థనమండలే

70 просмотров · 2 месяца назад
ARTA
432 подписчика
70 просмотров · 2 месяца назад
Lyrics by Smt Suvarna Lakshmi/ Music generated by AI సముద్రవసనే దేవి, పర్వతస్థనమండలే, విష్ణుపత్నీ నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే॥ అనంత సముద్రములు నీ వస్త్రములు, అచలగిరులే నీ అమృతస్థనములు, విష్ణుమాయా స్వరూపిణి, ప్రకృతి పరాశక్తి, భూమాత! నా పాదములతో నిన్ను స్పృశించుచున్నాను, క్షమించవే॥ సముద్రవసనే దేవి, పర్వతస్థనమండలే, అపార జలనిధులు నీ కరుణా తరంగములు, జీవనచక్ర ఆధారభూత సాగరంబులే నీ వస్త్రములు, అఖిల విశ్వాధార ప్రకృతి స్వరూపిణి, సకల జీవుల జీవనదాయిని, భూదేవి॥ సముద్రవసనే దేవి, పర్వతస్థనమండలే, పర్వత శిఖరములు నీ పాలధారలు, తల్లి స్థనములవలె ప్రపంచాన్ని పోషించు జగదాంబవు, అన్నపూర్ణ రూపమై అన్నమిచ్చు తల్లి, పంచభూత దివ్యాంగిక, వృక్షలతలు, ఔషధ ఖనిజ సంపదలకు నిలయమైన భూమాత॥ సముద్రవసనే దేవి, పర్వతస్థనమండలే, భూమియై స్థిరత్వమును ప్రసాదించెదవు, జలమై జీవరసమును ప్రవహింపజేసెదవు, అగ్నియై చైతన్యదీపము వెలిగించెదవు, వాయువై ప్రాణమై, ఆకాశమై వ్యాపించెదవు॥ సముద్రవసనే దేవి, పర్వతస్థనమండలే, ధర్మమార్గమున నడిపించు దయామయి, దినదినము నా పాదములతో నిన్ను తొక్కుచున్నాను, భూమాత! క్షమించుము దయామయీ, విష్ణుపత్నీ, విమలే, వసుధా! నీకు నమస్కరించెద॥ సముద్రవసనే దేవి, పర్వతస్థనమండలే, విష్ణుపత్నీ నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే॥