Перейти к содержимому

Brahmotsava Veduka No.2/Video 676/బాగు బాగుగా వచ్చెను చూడు వేంకటరాయుడు,

ARTA

0:00 / 0:00

Brahmotsava Veduka No.2/Video 676/బాగు బాగుగా వచ్చెను చూడు వేంకటరాయుడు,

259 просмотров · 11 дней назад
ARTA
431 подписчик
259 просмотров · 11 дней назад
Lyrics by Smt Suvarna Lakshmi/Music generated by AI బాగు బాగుగా వచ్చెను చూడు వేంకటరాయుడు, మెండు మెండుగా తన వాహన భక్తుల సద్గుణములు చెప్పగా వచ్చెను. బాగు బాగుగా వచ్చెను చూడు వేంకటరాయుడు, మెండు మెండుగా తన వాహన భక్తుల సద్గుణములు చెప్పగా వచ్చెను. శ్రీదేవి భూదేవి సమేత శ్రితపారిజాతుడు, పలు రూపాల వీధులేగి నడతలు నేర్పే సదాశీలుడు. బాగు బాగుగా వచ్చెను చూడు వేంకటరాయుడు, మెండు మెండుగా తన వాహన భక్తుల సద్గుణములు చెప్పగా వచ్చెను. వేయి పడగల నీడలో నిత్యపాన్పైన ఆదిశేషుడు, అపార భక్తి గూడిన సత్యనిష్ఠా గరిష్టుడనెను. సముద్ర మథనమున మందరగిరి చుట్టూ తానైన వాసుకి, భయము, అహము లేక మృత్యువును అధిగమించుమను గొప్ప ఆధ్యాత్మిక శక్తి అనెను. క్షీరనీరములను వేరు చేయు హంసను అధిరోహించి, చెడును విడిచి మంచిని గ్రహించు ఘన వివేక సాక్షి హంసయనెను. దురహంకారము దునుమాడెడి ధర్మబలుడు నరసింహుడు, పరమ దయాళువుడతడని సింహబలము చాటెను. ముత్యపు పందిరి నీడన మెరిసే ముక్తిప్రదాయకుడు, నిర్మలమూ, సత్యమూ, కల్మషము లేనిది ముత్యమనెను. కల్పవృక్ష సేవన కొలువైన కామితార్థుడు, పరుల మేలుకై నిస్వార్థ గుణము చాటునది కల్పతరువనెను. సర్వభూపాలమున సేదదీరి జగదోద్ధారుడు, పాలకుడికి ప్రజారక్షణే పరమ ధర్మమనెను. మోహినిగా మురిపించే ముగ్ధమోహన గోవిందుడు, మాయా మోహపు తెరలను తొలగించి పరతత్త్వము పట్టుమనెను. వినతాతనయుని భుజములపై విహరించే నారాయణుడు, అనంత భక్తిని, శక్తిని తన సేవకై అర్పించెను గరుడుడనెను. దాస్యభక్తి గూడిన హనుమంతుని ఎక్కి, బలమున వినయము, భక్తిలో నిష్ఠ రామబంటు సిరులనెను. స్వర్ణరథమున సతులతో మెరిసె సౌందర్యనిధియై, పుత్తడి కాంతులను మించిన గుణములే భక్తుల సిరులనెను. గంభీర గభస్తినేమియై గజమునెక్కి గోవిందుడు, బలగర్వములు నశించునవని ఎంచి, శరణన్న స్థిరచిత్తుడు గజేంద్రుడనెను. బాగు బాగుగా వచ్చెను చూడు వేంకటరాయుడు, మెండు మెండుగా తన వాహన భక్తుల సద్గుణములు చెప్పగా వచ్చెను. సూర్యప్రభపై తరలి వచ్చె, జీవకోటికి జీవము పోయు జగదాధారుడు, భేదములేక వెలుగును పంచు కర్తవ్యనిష్ఠుడు సూర్యుడనెను. చంద్రప్రభపై చల్లగా వచ్చే శశాంకశయనుడు, తాపము తీర్చు శాంతి సుధామయుడు చంద్రుడనెను. రథమున ఊరేగి వచ్చి జగన్నాథుడు, జనన మరణముల బంధము దాటించు పరమాత్మను గాంచమనెను. అశ్వవాహనముపై రాజసమున తరలి వచ్చి అఖిలాండుడు, శక్తి, వేగము, చురుకుదనము, శాంతము అశ్వసంపదలనెను. చక్రస్నాన మహోత్సవమున మమ్ముల పవిత్రుల జేసి, సుదర్శన దివ్య తేజముతో వైకుంఠమునే ఇల చూపి, సాలు సాలున బ్రహ్మదేవుడు నడుపు బ్రహ్మోత్సవమున మురిపించి మమ్ములననుగ్రహించు వరదుడు హేమాంగుడు శ్రీ వేంకటాచలపతి. బాగు బాగుగా వచ్చెను చూడు వేంకటరాయుడు, మెండు మెండుగా తన వాహన భక్తుల సద్గుణములు చెప్పగా వచ్చెను. బాగు బాగుగా వచ్చెను చూడు వేంకటరాయుడు, మెండు మెండుగా తన వాహన భక్తుల సద్గుణములు చెప్పగా వచ్చెను.