ఈశ్వరా!ఇన్నిమేళ్ళు చేసిన మిమ్మెట్లా మరచిపోదుము!!(స్వయం వ్రాసుకొని స్వరపరచిన మధురగీతం)
Rudrageethi(రుద్రగీతి)
0:00 / 0:00
ఈశ్వరా!ఇన్నిమేళ్ళు చేసిన మిమ్మెట్లా మరచిపోదుము!!(స్వయం వ్రాసుకొని స్వరపరచిన మధురగీతం)
1 541 просмотр · 1 мес. назад
Rudrageethi(రుద్రగీతి)
761 подписчик
1 541 просмотр · 1 мес. назад
ఎట్ల మిమ్ము మరచిపోదురా ఈశ్వరా!
ఎట్ల మిమ్ము విడిచిపోదురా ఓ ఈశ్వరా!
ఎట్ల మిమ్ము మరచిపోదురా........
మీరులేని జీవితమున ఏమివున్న వ్యర్థమేకదా!
మీరుఉన్న మాకుఇంక లోటన్నది లేదుకదా!
మీరులేని జీవితము ఉన్నకూడ శూన్యమేకదా!
మీరు కూడఉంటే మాకింకేమక్కర లేదుగా
ఎవరు ఇవ్వలేని సుఖం మీరే ఇచ్చినారుకదా!
ఎవరు ఇవ్వలేని బలం మీరే కూర్చినారుకదా!
ఎవరు ఇవ్వలేని సుఖం మీరే ఇచ్చినారుకదా!
ఎవరు ఇవ్వలేని బలం మీరే కూర్చినారుకదా!
ఏమివున్న,లేకున్నది మీరువుంటే చాలునుకదా
ఎట్ల మిమ్ము మరచిపోదురా ఈశ్వరా!
ఎట్ల మిమ్ము విడిచిపోదురా ఓ ఈశ్వరా!
ఎట్ల మిమ్ము మరచిపోదురా....
దివ్యజనుమనిచ్చి మాకు తల్లివైనావు కదా!
దివ్య-పాలనమునిచ్చి తండ్రివైనావు కదా!
దివ్య-శిక్షనిచ్చి మాకు గురువువైనావు కదా!
గతి-సద్గతినీ ఇచ్చి సద్గురువువైనావు కదా!
ఈ మానవ వృక్షానికి బీజరూపి మీరేకదా!
మా జీవన నావకు చుక్కానివంటే మీరేకదా!
ఈ మానవ వృక్షానికి బీజరూపి మీరేకదా!
మా జీవన నావకు చుక్కానివంటే మీరేకదా!
ఇక,మరణమైన,శరణమైన అన్నిమాకు మీరేకదా!.
ఎట్ల మిమ్ము మరచిపోదురా ఈశ్వరా!
ఎట్ల మిమ్ము విడిచిపోదురా ఓ ఈశ్వరా!
ఎట్ల మిమ్ము మరచిపోదురా....
శాశ్వతమని అనుకున్నది ఇక్కడేమి ఉందిరా, ఈ
వస్తు,వ్యక్తి,వైభవవాలు ఎంతవరకు శాశ్వతమురా
బంధు-బలగమున్నదంటు విర్రవీగి పోకుమురా
ఏది నీది కాదు ఇంక ఉన్నదంత మిధ్యయేకదా!
సర్వ-శ్రేష్ఠుడైన శివునియందు మనసు నిలుపుమురా
సత్యమైన,నిత్యమైన అతను ఒకడే మనకుగదరా
సర్వ-శ్రేష్ఠుడైన శివునియందు మనసు నిలుపుమురా
సత్యమైన,నిత్యమైన అతను ఒకడే మనకుగదరా
అతను లేని జీవితము ఎండుటాకు వగడులాగ
ఎట్ల మిమ్ము మరచిపోదురా ఈశ్వరా!
ఎట్ల మిమ్ము విడిచిపోదురా ఓ ఈశ్వరా!
ఎట్ల మిమ్ము మరచిపోదురా....
ధనమువెంటపడి నీవు గుణమునెపుడు మరువకురా
గుణము ఉంటేచాలు అన్ని వెనువెంటనే వొచ్చునుగదా
సర్వవ్యాపి అంటు శివుని నిందలెపుడు చేయకురా
సర్వ-బంధాలు అన్ని అతనితోన గలుపుమురా
శివుని-ఆన వీసమెత్తు వీడి నీవు నడువకుమురా
శివునిపైన భారమేసి ప్రతి అడుగును వేయుమురా
ఆ శివుని-ఆన వీసమెత్తు వీడి నీవు నడువకుమురా
శివునిపైన భారమేసి ప్రతి అడుగును వేయుమురా
ఈశ్వరుని స్మృతిలోనీ లోకమంత ఇమిడుందిరా
ఎట్ల మిమ్ము మరచిపోదురా ఈశ్వరా!
ఎట్ల మిమ్ము విడిచిపోదురా ఓ ఈశ్వరా!
ఎట్ల మిమ్ము మరచిపోదురా....