చింతవలదు చేరరావో శివసన్నిధికి(స్వయం రాసుకొని స్వరపరచిన గీతమాల
Rudrageethi
0:00 / 0:00
చింతవలదు చేరరావో శివసన్నిధికి(స్వయం రాసుకొని స్వరపరచిన గీతమాల
1 546 просмотров · 4 дня назад
Rudrageethi
59 подписчиков
1 546 просмотров · 4 дня назад
ఇంతకాదు,అంతకాదులే శివతండ్రి ఇచ్చిన భాగ్యం
చింతవలదు,చింతవలదు చేరరావో శివసన్నిధికి హోయ్....
ఇంతకాదు,అంతకాదులే శివతండ్రి ఇచ్చిన సౌఖ్యం
చింతవలదు,చింతవలదు చేరరావో శివసన్నిధికి
ఇంతకాదు అంత కాదులే.......
దివ్యబుద్ధినీ ఇచ్చాడు,ఆత్మదృష్టి కలిగించాడు
సుగుణాలను మాలోనింపి,దేవతలుగ చేస్తున్నాడు
దివ్యబుద్ధినీ ఇచ్చాడు,ఆత్మదృష్టి కలిగించాడు
సుగుణాలను మాలోనింపి,దేవతలుగ చేస్తున్నాడు
అణగారిన శక్తి,యుక్తుల ఆర్డర్లో తెస్తున్నాడు
రాయిలాగ వున్న మమ్ము,రతనములా చేస్తున్నాడు. హోయ్...
ఇంతకాదు,అంతకాదులే శివతండ్రి ఇచ్చిన భాగ్యం
చింతవలదు,చింతవలదు చేరరావో శివసన్నిధికి
ఇంతకాదు అంత కాదులే.......
శుభభావన కలిగించాడు,శుభకామన పూరించాడు
అవగాహన లేని మమ్ము,ఆస్తికునిగ చేస్తున్నాడు
శుభభావన కలిగించాడు,శుభకామన పూరించాడు
అవగాహన లేని మమ్ము,ఆస్తికునిగ చేస్తున్నాడు
అమృతాన్ని త్రాగించాడు,అమరులుగా చేస్తున్నాడు
సర్వరోగాలకు కూడ తన తలపే మందన్నాడు హోయ్.....
ఇంతకాదు,అంతకాదులే శివతండ్రి ఇచ్చిన భాగ్యం
చింతవలదు,చింతవలదు చేరరావో శివసన్నిధికి
ఇంతకాదు అంత కాదులే.......
సాక్షి స్థితిని కలిగించాడు,సాథీగా తనే అయినాడు
సారయుక్త జీవనమిచ్చి,సంపూర్ణం చేస్తున్నాడు
సాక్షి స్థితిని కలిగించాడు,సాథీగా తనే అయినాడు
సారయుక్త జీవనమిచ్చి,సంపూర్ణం చేస్తున్నాడు
లేజీగా వున్న మమ్ము, బిజీ బిజీ చేసేసాడు
శ్వాస,సమయ,సంకల్పాల్ని సఫలముగా చేయించాడు. హోయ్..
ఇంతకాదు,అంతకాదులే శివతండ్రి ఇచ్చిన భాగ్యం
చింతవలదు,చింతవలదు చేరరావో శివసన్నిధికి
ఇంతకాదు అంత కాదులే.......
జ్ఞానయోగ రెక్కలనిచ్చి,స్వేచ్ఛగ మము ఎగిరించాడు
సర్వ-సంబంధాలన్నీ తనతోనే జోడించాడు
జ్ఞానయోగ రెక్కలనిచ్చి,స్వేచ్ఛగ మము ఎగిరించాడు
సర్వ-సంబంధాలన్నీ తనతోనే జోడించాడు
సత్యపథములో నడిపించి,స్వర్గసుఖాన్నిస్తున్నాడు
సత్యపథములో నడిపించి,స్వర్గసుఖాన్నిస్తున్నాడు
సర్వ కళ్యాణములోన మము సమిధగ చేస్తున్నాడు. హోయ్
ఇంతకాదు,అంతకాదులే శివతండ్రి ఇచ్చిన భాగ్యం
చింతవలదు,చింతవలదు చేరరావో శివసన్నిధికి
చింతవలదు,చింతవలదు చేరరావో శివసన్నిధికి
చింతవలదు,చింతవలదు చేరరావో శివసన్నిధికి
...