Irandam Thiruvandadi57,58🙏ఇరణ్డామ్ తిరువందాది 57,58 పాశురములు
Padmaja Ramanujadasi
0:00 / 0:00
Irandam Thiruvandadi57,58🙏ఇరణ్డామ్ తిరువందాది 57,58 పాశురములు
2 256 просмотров · Трансляция закончилась 6 дней назад
Padmaja Ramanujadasi
57,6 тыс. подписчиков
2 256 просмотров · Трансляция закончилась 6 дней назад
నేటి ప్రశ్నలు: ఇరణ్డామ్ తిరువందాది 57, 58 పాశురములు
01 : ఆళ్వార్లకు పాశురాలు పాడడం ఎవరు నేర్పారు!?
సమాధానము : ఆழ்వార్లకు పాశురాలు పాడడం పెరుమాళ్ల ఆజ్ఞ మేరకు నామఙ్గై [ సరస్వతీదేవి ] నేర్పారు.
02 : మనం ఎవరిని ఆశ్రయించాలని ఆళ్వార్లు ఉపదేశించారు?
సమాధానము : మనం అమ్మతో కూడి యున్న స్వామిని [ శ్రీమన్నారాయణుని ] ఆశ్రయించాలని ఆழ்వార్లు ఉపదేశించారు.
03 : "తిరుమఙ్గై", "నామఙ్గై" అంటే ఎవరు?
సమాధానము : "తిరుమఙ్గై అంటే 16 సంవత్సరముల తారుణ్యస్థితిలో నున్న లక్ష్మీదేవి", "నామఙ్గై అంటే వాగ్దేవి"
04 : "నామ్ పెత్త నన్మైయుమ్" అనుట ద్వారా ఆళ్వార్లు తాము ఏ ఫలం పొందామంటున్నారు?
సమాధానము : "నామ్ పెత్త నన్మైయుమ్" అనుట ద్వారా ఆழ்వార్లు తాము అలభ్యలాభంగా పాశురములను నేర్చుకునే భాగ్యమనే లాభాన్ని పొందామంటున్నారు.
#irandam_thiruvandadi
#pasuram57
#pasuram58
#pudattazhwar
#bhuta_yogi
#srirangam
#thirumala
#6years_of_ynv_goshti
#yathirajanadhavalli_goshti
#padmajaramanujadasi
#acharya_vaibhavam
#ramanuja_vaibhavam
#bhagavad_ramanuja
#thirunakshatram
#divyadesalu
#samasrayanalu
#vaishnava_sampradayam
#srivaishnavism
#bhagavadvishayam
#alwar
#azhwar
#andal
#goda
#krishna
57) తిరుమఙ్గై నిన్ఱరుళుమ్ తెయ్వమ్ ౹ నా వాழ்త్తుమ్ ।
కరుమమ్ । కడైప్పడుమిన్ కణ్డీర్ ౹ ఉరిమైయాల్
ఏత్తినోమ్ పాదమ్ । ఇరుమ్ దడక్కై ఎన్దైపేర్ ।
నాల్ తిశైయుమ్ కేట్టిరే । నామ్॥ 2238
ప్రతిపదార్థములు : తిరుమంగై నిన్ఱు అరుళుమ్ దెయ్వమ్ = శ్రీ దేవి నిత్య నివాసము చేయు దైవమును ; నా వాழ்త్తుమ్ కరుమమ్ = నాల్కతో నామమును పలుకు కార్యమును ; కడై పిడిమిన్ కండీర్ = వదలి పెట్టక పట్టుకొనుడు ; నాల్ దిశైయుం కేట్టిరే = నాల్గు దిశల నున్న వారెల్లరు వింటిరే ; నామ్ = మన వఱకు మనము ; ఉరిమై యాల్ = మన బాధ్యతను గుర్తించి ; ఇరుమ్ దడక్కై ఎన్దై = దీర్ఘ బాహువులతో కూడిన నాతండ్రి ; పాదమ్ పేర్ ఏత్తినోమ్ = పాదములను, నామములను స్తుతింతుము.
భావమ్ : శ్రీ మహాలక్ష్మిని సర్వదా తనలో కలిగించుకొని వాసమేర్పరచిన శ్రీహరిని దృఢముగ కీర్తించుము. ఆజానుబాహుడగు భగవంతుని దివ్య నామములను పాదములను మనకు తోచిన భంగిగ నుపాసింతుము. నాల్గు దిక్కుల వసించు వారి కెల్లరుకును నీ విషయము వినవచ్చుచున్నది కదా !
58) నాంపెற்றనన్మైయుం । నామఙ్గైనన్నెఞ్జత్తు ।
ఓమ్బియిరున్దు । ఎమ్మై ఓదువిత్తు । వేమ్బిన్
పొరుళ్ నీర్మై ఆయినుం । పాన్ ఆழிపాడు ఎన్ఱు ।
అరుళ్ నీర్మై తన్ద ౹ అరుళ్ ॥ 2239
ప్రతిపదార్థములు : వేమ్బు పొరుళిన్ నీర్మై ఆయినుమ్ = వేపగింజ వంటి స్వభావము కలిగినదైనను ; పొన్ ఆళి = సొగసైన చక్రమును ధరించిన వానిని ; పాడు ఎన్ఱు = పాడుము అని ; నామంగై = వాగ్దేవత ; నల్ నెంజత్తు = మన మంచి మనసును ; ఓమ్బి ఇరున్దు = నెలకొని ; ఎమ్మై ఓదువిత్తు = మనచే హరి కీర్తనల పాడించి ; నామ్ పెற்ற నన్మైయుమ్ = మనము పొందిన భాగ్యము ; అరుళ్ నీర్మై = ప్రసాద ఫలితమే ; తన్ద అరుళ్ = మనకు లభించిన అనుగ్రహమగును.
భావమ్ : వేప గింజ చేదువలె హరి నామ కీర్తనలున్నప్పటికి చక్రమును ధరించు శ్రీహరిని "నీవు స్తుతింపుము" అని వాగ్దేవి నా మనస్సు నాదరించి, నా చేత కీర్తనల పాడించి అనుగ్రహించినది. ఇట్టి భాగ్యమును పొందుట కాస్వామి దయయే కారణము.
పూదత్తాழ்వార్ తిరువడిగళే శరణమ్
ఆழ்వార్, ఎమ్బెరుమానార్, జీయర్ తిరువడిగళే శరణమ్
━❀꧁꧂❀┅ ధరణి ┅❀꧁꧂❀━
ONLINE CLASSES
Daily from 3.30pm to 5pm
FCC (Free Conference Call) LINK:
https://join.freeconferencecall.com/p...
TELEGRAM LINK:
https://t.me/joinchat/LyoBXhelW-PjquD...
YOUTUBE LINK:
/ @padmajaramanujadasi
WEBSITE ADDRESS:
https://padmajaramanujadasi.com/te/
WHATSAPP CHANNEL LINK:
https://whatsapp.com/channel/0029Va6S...
INSTAGRAM LINK
https://www.instagram.com/padmaja_ram...
FACEBOOK LINK
/ 1evsdq7rau
అడియేన్ రామానుజదాసి🙏