Kesava Naamaamrutam song/ Video 670/నీ మధురామృత గానమే — నా మదిన మెదలనీ
ARTA
0:00 / 0:00
Kesava Naamaamrutam song/ Video 670/నీ మధురామృత గానమే — నా మదిన మెదలనీ
96 просмотров · 2 месяца назад
ARTA
431 подписчик
96 просмотров · 2 месяца назад
Lyrics by Smt Suvarna Lakshmi/ Music generated by AI
నీ మధురామృత గానమే — నా మదిన మెదలనీ
నీ నిత్యమంగళ రూపమే — నా కనుల కదలనీ
నీ పదపద్మములే — పరమగతియై నా జీవనమే సాగనీ
నీ తలంపే నా పరమానందమై — ప్రతిక్షణం జీవించనీ
వేణువై నా ఊపిరిలో — నీ నామమే పలుకనీ
వెన్నెలై నా మనసులో — నీ రూపమే వెలుగనీ
ప్రేమయే పూమాలగా — నీ పాదముల చేరనీ
జన్మజన్మలకు నా హృదయం — నీ ఆలయమై నిలవనీ
జన్మజన్మలకు నా హృదయం — నీ ఆలయమై నిలవనీ
కేశవా — సకల జగముల దివ్య స్వరూపా
నారాయణా — నరులందరికీ పరమాశ్రయా
మాధవా — లోకమాత శ్రీమహాలక్ష్మీ హృదయేశ్వరా
గోవిందా — వేదనాదములందు వెలసిన దేవా
జన్మజన్మలకు నా హృదయం — నీ ఆలయమై నిలవనీ
విష్ణువా — విశ్వమంతట వ్యాపించిన పరమాత్మా
మధుసూదనా — మధుదైత్య సంహారా, రాగద్వేష నాశకా
త్రివిక్రమా — మూడడుగులతో ముల్లోకములు కొలిచిన త్రిపదుడా
వామనా — వినయరూపా, అనంత పుణ్యఫల ప్రదాయకా
జన్మజన్మలకు నా హృదయం — నీ ఆలయమై నిలవనీ
శ్రీధరా — శ్రీదేవిని హృదయాన ధరించిన శ్రీవేంకటరమణా
హృషీకేశా — సకల జీవుల హృదయాధీశా, అంతర్యామీ
పద్మనాభా — నాభికమలమున సృష్టిని వికసింపజేసిన అక్షోభ్యా
దామోదరా — యశోదమ్మ ప్రేమబంధమున ఒదిగిన బాలకా
జన్మజన్మలకు నా హృదయం — నీ ఆలయమై నిలవనీ
సంకర్షణా — సకల జీవుల ఆకర్షకా
వాసుదేవా — సర్వభూత హృదయస్థితా
ప్రద్యుమ్నా — అందరి హృదయాల ప్రేమజ్యోతి వెలిగించు జగన్నాథా
అనిరుద్ధా — అడ్డు లేని అనంత శక్తి స్వరూపా
జన్మజన్మలకు నా హృదయం — నీ ఆలయమై నిలవనీ
పురుషోత్తమా — సర్వ శ్రేష్ఠ ఘన పరమ పురుషా
అధోక్షజా — ఇంద్రియజ్ఞానమునకందని దివ్య తత్వమా
నారసింహా — భక్త ప్రహ్లాదుని కాచిన కరుణాసాగరా
అచ్యుతా — ఎన్నటికీ చ్యుతిలేని శాశ్వత సత్యమా
జన్మజన్మలకు నా హృదయం — నీ ఆలయమై నిలవనీ
జనార్దనా — జనుల ఆర్తిని తొలగించు జగద్రక్షకా
ఉపేంద్రా — దేవేంద్రుని సోదరుడై వెలసిన వామనా
హరీ — హృదయమలినముల హరించు శ్రీహరీ
శ్రీకృష్ణా — భక్తి ప్రేమల పరిపూర్ణ పరబ్రహ్మా
జన్మజన్మలకు నా హృదయం — నీ ఆలయమై నిలవనీ
నీ నామమే కమనీయ గానము
నారాయణా — నీ నామమే జీవమంత్రము
కేశవ నామాలే — హృదయార్చన పుష్పాలు
నీ పాదములకర్పింతు — నీ నామచింతన చేయు నా చిత్తంబు
కేశవ మాధవ ముకుందా గోవిందా
కేశవ మాధవ ముకుందా గోవిందా
కేశవ మాధవ ముకుందా గోవిందా