ఆశ్రయుడా నా యేసయ్య | Aashrayuda Naa Yesayya | FaithHub
FaithHub
0:00 / 0:00
ఆశ్రయుడా నా యేసయ్య | Aashrayuda Naa Yesayya | FaithHub
286 просмотров · 9 дней назад
FaithHub
215 подписчиков
286 просмотров · 9 дней назад
ఆశ్రయుడా నా యేసయ్య 🙏❤️
నా జీవితానికి నీవే ఆధారం, నీవే ఆశ్రయం.
ఈ ఆరాధనా గీతం మీ హృదయానికి శాంతి, ఆనందం మరియు దేవుని సన్నిధిని కలిగించుగాక. ✝️
🎧 Listen • Worship • Be Blessed
FaithHub — Songs of Faith & Worship
🙏 ఈ పాట మీకు ఆశీర్వాదంగా అనిపిస్తే Like, Share & Subscribe చేయండి.
ఆశ్రయుడా నా యేసయ్య
స్తుతి మహిమప్రభావము నీకేనయ్యా (2)
విశ్వవిజేతవు – సత్యవిధాతవు
నిత్యమహిమకు ఆధారము నీవు (2)
లోకసాగరాన కృంగినవేళ
నిత్యమైనకృపతో వాత్సల్యము చూపి
నను చేరదీసిన నిర్మలుడా
నీకేనయ్యా ఆరాధనా
నీకేనయ్యా స్తుతిఆరాధనా (2)
||ఆశ్రయుడా||
1. తెల్లని వెన్నెలకాంతివి నీవు
చల్లని మమతల మనసే నీవు (2)
కరుణనిచూపి కలుషముబాపి
నను ప్రేమించిన ప్రేమవు నీవు (2)
జనులకు దైవం జగతికి దీపం
నీవుగాక ఎవరున్నారు ?
నీవే నీవే ఈ సృష్టిలో
కొనియాడబడుచున్న మహరాజువు (2)
||ఆశ్రయుడా||
2. జీవితదినములు అధికములగునని
వాగ్దానముచేసి దీవించితివి (2)
ఆపత్కాలమున అండగనిలిచి
ఆశలజాడలు చూపించితివి (2)
శ్రీమంతుడవై సిరికే రాజువై
వ్యధలనుబాపి నా స్థితిమార్చితివి
అనురాగమే నీ ఐశ్వర్యమా
సాత్వికమే నీ సౌందర్యమా (2)
||ఆశ్రయుడా||
3. నీ చిత్తముకై అరుణోదయమున
అర్పించెదను నా స్తుతిఅర్పణ (2)
పరిశుద్ధులలో నీ స్వాస్థ్యముయొక్క
మహిమైశ్వర్యము నేపొందుటకు (2)
ప్రతివిషయములో స్తుతి చెల్లించుచు
పరిశుద్ధాత్మలో ప్రార్థించెదరు
పరిశుద్ధుడా పరిపూర్ణుడా
నీ చిత్తమే నాలో నెరవేర్చుమా (2)
||ఆశ్రయుడా||