Перейти к содержимому

PAHI RAMAPRABHO | LORD SRI RAMA SONG | SRI BHADRACHALA RAMADASU

Sravana Keerthanam

0:00 / 0:00

PAHI RAMAPRABHO | LORD SRI RAMA SONG | SRI BHADRACHALA RAMADASU

267 просмотров · 5 дней назад
Sravana Keerthanam
73 подписчика
267 просмотров · 5 дней назад
పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో పాహి రామప్రభో || ఇందిరా హృదయారవిందాదిరూఢ సుందరాకార ఆనంద రామప్రభో ఎందునే చూడ మీ సుందరానందము కందునో కన్నులింపొంద రామప్రభో || పాహి రామప్రభో || బృందారకాది బృందార్చిత పదార విందముల సందర్శితానంద రామప్రభో తల్లివి నీవె మా తండ్రివి నీవె మా దాతవు నీవె మా భ్రాత రామప్రభో || పాహి రామప్రభో || నీదు బాణంబులను నాదు శత్రులబట్టి బాధింపకున్నావదేమి రామప్రభో ఆదిమధ్యాంత బహిరంతరాత్ముండనుచు వాదింతునే జగన్నాథ రామప్రభో || పాహి రామప్రభో || శ్రీ రామరామేతి శ్రేష్ఠ మంత్రము సారె సారె కును వింతగా చదువు రామప్రభో శ్రీ రామ నీ నామ చింతనామృత పాన సారమే నాదు మది గోరు రామప్రభో || పాహి రామప్రభో || కలికి రూపము దాల్చి కలియుగంబున నీవు వెలసితివి భద్రాద్రి నిలయ రామప్రభో అవ్యయుడవైన ఈ అవతారములవలన దివ్యులైనారు మునులయ్య రామప్రభో || పాహి రామప్రభో || పాహి శ్రీ రామ నీ పాద పద్మాశ్రయుల పాలింపుమా భద్రశీల రామప్రభో పాహి రామప్రభో పాహి రామప్రభో పాహి భద్రాద్రి వైదేహి రామప్రభో || పాహి రామప్రభో || #pahiramaprabho #telugudevotionalsongs #devotionalsongstelugu #lyricalvideo #devotionalsongs