Asamanundagu oh kristu || అసమానుండగు ఓ క్రీస్తు | Hebron Song | #hebronsongs #hebronsongsintelugu
Zion Songs Telugu Hebron
0:00 / 0:00
Asamanundagu oh kristu || అసమానుండగు ఓ క్రీస్తు | Hebron Song | #hebronsongs #hebronsongsintelugu
439 просмотров · 1 год назад
Zion Songs Telugu Hebron
975 подписчиков
439 просмотров · 1 год назад
Asamanundagu oh kristu || అసమానుండగు ఓ క్రీస్తు song from zion songs telugu hebron
📌 Follow us for updates:
YouTube: @ZionSongsTeluguHebron
"ఆయనకు అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము" కొలొస్స Colossians 1:18
పల్లవి : అసమానుండగు ఓ క్రీస్తు - అద్వితీయుండగు దేవా
అల్ఫాయు ఓమేగ (2) నీవే ప్రభువా (2)
1. ఇహపరములలో నీ జన్మ - మహానందము కలిగించె (2)
అభయము నిచ్చి మాకు - భయభీతిని బాపితివి (2)
భయభీతిని బాపితివి
|| అసమానుండగు ||
2. నీ జీవిత వాక్కులన్ని - సజీవము జనులందరికి
పావనుడా మా ప్రభు యేసు - అవనికి మాదిరి నీవే
|| అసమానుండగు ||
3. మరణము గెల్చిన మా ప్రభువా - పరమ దేవుడవు నీవే
సాతానున్ ఓడించి - నీతిగా మము తీర్చితివి
|| అసమానుండగు ||
4. పాపశాపముల బాపితివే - చూపితివే పరమదారి
శక్తిగల ఓ ప్రభువా - నీకే మా స్తోత్రములు
|| అసమానుండగు ||
5. విశ్వమంతట ఓ దేవా - శాశ్వతమైనది నీ ప్రేమ
జ్ఞానమునకు మించినది - ఉన్నతమైన ప్రేమ
భయభీతిని బాపితివి
|| అసమానుండగు ||
6. సంఘమునకు శిరస్సు నీవే - అంగములుగ మము జేసితివి
సర్వ సంపూర్ణుండా - సర్వ మహిమ నీకే
|| అసమానుండగు ||
#hebronsongsofziontelugu #hebron #2025
#bakhtsingh #hebron #hebronsongs #hebronsongsintelugunew #hebronindia #christiansongs #christmas #christian #jesus #hebronheadquater #song