“యేసు చూపు ఇచ్చాడు… కానీ నిజమైన చూపు ఎప్పుడు వచ్చింది?” #యేసుక్రీస్తు #viralvideo #trending #viral
God's Little Army
0:00 / 0:00
“యేసు చూపు ఇచ్చాడు… కానీ నిజమైన చూపు ఎప్పుడు వచ్చింది?” #యేసుక్రీస్తు #viralvideo #trending #viral
204 просмотра · 11 дней назад
God's Little Army
602 подписчика
204 просмотра · 11 дней назад
♻️ యేసు_మరియు_గుడ్డి_వాడు
🛑 {యోహాను సువార్త 9:1-12}
✨ యేసుక్రీస్తు వారు ఈ లోకంలో అనేక అద్భుతములు జరిగించాడు. ఒకనాడు ఆయన మార్గంలో పోవుచుండగా పుట్టు గ్రుడ్డివాడైన ఒక మనుషుడు కనపడెను ఆయన శిష్యులు వీడు గ్రుడ్డి వాడై పుట్టుటకు ఎవరు పాపం చెసేను వీడా? వీడిని కన్నవారా? అని ఆయనను అడిగెను అందుకు యేసు వీడైనను వీడిని కన్నవారైనను పాపం చేయలేదు కానీ దేవుని క్రియలు మహిమ పరచబడుటకే వీడు గ్రుడ్డి వాడిగా పుట్టెను అని చెప్పి ఆ గ్రుడ్డి వాని దగ్గరకు వెళ్ళి నేల మీద ఉమ్మి వేసి దానితో బురద చేసి ఆ బురదను వాని కన్నుల మీద పూసి నీవు కోనేటికి వెళ్ళి ని కన్నులను కడుక్కోమని చెప్పెను వాడు ఆ కోనేటికి వెళ్ళి వాడి కళ్ళను కడుగుకొనెను అద్భుతం నిజంగా అక్కడొక గొప్ప అద్భుతం జరిగింది ఆ గ్రుడ్డి వాడికి చూపు వచ్చింది అతడు ఈ లోకాన్ని చూడగలుగుతున్నాడు
✨ పుట్టినప్పటి నుండి ఎప్పుడు చూడని వాడు ఈ లోకాన్ని చూసి ఆశ్చర్యపోతున్నాడు అతను ఎంతో సంతోషంగా ఉన్నాడు చుట్టు ప్రక్కల ఉన్న వారంతా నీవు పుట్టు గ్రుడ్డి వాడివి కదా నీకు కన్నులు ఎలా వచ్చాయ్ అని ఆశ్చర్యంగా అడగసాగారు అందుకు వాడు యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కన్నులకు వ్రాసి నీవు కోనేటిలో కడుగుకోమని చెప్పెను నేను వెళ్ళి కడుగుకొనగానే నాకు చూపు వచ్చింది అని ఎంతో సంతోషంగా చెప్పెను.
✨ యేసు ఈ అద్భుతం చేసినది విశ్రాంతి దినమున దీన్ని గూర్చి పరిసయ్యులు వానిని పిలచి నీవు చూపు ఎలా పొందావో చెప్పమనిరి అందుకు అతను యేసు చేసిన కార్యమును గూర్చి వివరించెను అందుకు వారును ఆశ్చర్యపోయిరి కాబట్టి వారు ఆ గ్రుడ్డి వానితో అతను నీ కన్నులు తెరచి నందుకు నీవు అతని గూర్చి ఏమనుకొనుచున్నావు అని అడిగిరి అందుకు అతను ఒక ప్రవక్త అని వారికి సమాధానం ఇచ్చెను వాడు గ్రుడ్డి వాడై చూపు పొందెను అని యూదులు నమ్మక చూపు పొందిన వాని తల్లిదండ్రులను పిలిపించ్చెను వారితో ఇతడు గ్రుడ్డి వాడై పుట్టిన మీ కుమారుడేనా వీనికి చూపు ఎలా వచ్చెను అని అడిగిరి అందుకు వారు ఇతను మా కుమారుడే కానీ ఇతనికి చూపు ఎలా వచ్చిందో మాకు తెలియదని అనిరి
✨ పరిసయ్యులు దేవుడు చేసిన అద్భుతమును నమ్మక ఆ గ్రుడ్డి వానితో ఆయన నీకేం చేసెను నీకు చూపు ఎలా వచ్చెను అని మరలా అడిగిరి అందుకు వాడు ఇంతకుముందు చెప్పాను కదా మీరెందుకు మరలా వినగోరుచున్నారు మీరు ఆయనకు శిష్యులవ్వాలని అనుకుంటున్నారా అని వారితో అన్నాడు అందుకు వారు నీవే వాని శిష్యుడవు మేము మోషే శిష్యులం దేవుడు మోషేతో మాట్లాడెనని ఎరుగుదుము గాని వీడెక్కడి నుండి వచ్చెనో మేము ఎరుగము అని చెప్పి వాడిని దూషించి అక్కడి నుండి వాడిని వెళ్ళగొట్టెను తరువాత యేసు వానిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా? అని అడిగెను అందుకు వాడు ప్రభువా నేను ఆయన యందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడిగెను అందుకు యేసు నీవు ఆయనను చూచుచున్నావ్ నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను అంతట వాడు ప్రభువా నేను విశ్వసించు చున్నాను అని చెప్పి ఆయనకు మ్రొక్కెను
♦️ ధ్యానాంశములు!
నా ప్రియ స్నేహితులారా! మన దేవుడు ఈ లోకమునకు వెలుగుగా ఉన్నాడు ఆయనలో చీకటి ఎంత మాత్రము లేదు ఆయనను తెలుసుకున్న మనం కూడ చీకటిలో ఉండక వెలుగుగా జీవించాలి చీకటి అంటే పాపం వెలుగు అంటే పరిశుద్దత మనం మన పాత జీవితాన్ని విసర్జించి యేసుక్రీస్తు చెప్పిన మార్గంలో నడవాలి దేవుడు మన నుండి కోరుకొనేది అంతే కదా ఇక నుంచి మంచి మార్గంలో నడుద్దాం...!!!
#AMEN 🙏🙏🙏
#BibleMessage #JesusChrist #GodsLittleArmy #ChristianTelugu #BibleStory #JesusMiracles