Перейти к содержимому

ఈ గీతం మీ జీవిత గమనాన్ని మారుస్తుందా ఏమో చూడండి వినండి Motivational Song

Seshachandracreations

0:00 / 0:00

ఈ గీతం మీ జీవిత గమనాన్ని మారుస్తుందా ఏమో చూడండి వినండి Motivational Song

1 529 просмотров · 9 дней назад
Seshachandracreations
278 подписчиков
1 529 просмотров · 9 дней назад
జీవితంలో ఎవరో వచ్చి మనల్ని బాగుచేయరు మనమే ధైర్యంగా ముందుకు సాగాలి. మనిషి గమనాన్ని మార్చే ప్రభోత్మాక గీతం ... ఎవరికి వారే ఎమునా తీరు ఈలోకం ఎవరో రారు నీ కోసం నీ ఆశే ఆయుధంగా చేసుకో నీ ఊపిరి ఉప్పెనగా కానీవ్వు భయమే వదులు బాధను మరువు గెలుపుకవుతుంది అది తొలి అడుగు ఓడినప్పుడే తెలుస్తుంది విజయం విలువ ఓటిమి కావాలి నీకో గుణపాఠం గెలుపోటములు కాదు శాశ్వితం గెలిచావా గర్వం పెంచుకోకు ఓడావా క్రుంగిపోకు అవుతుందది గెలుపుకు సోపానం...... పుట్టుకతో ఎవరు గొప్పవాళ్లు కారు సాధనతోనే సాధ్యమేదైనా నీ ఆశే ఆయుధంగా చేసుకో నీ ఊపిరి ఉప్పెనగా కానీవు ఎవరికి వారే ఎమునా తీరు ఈలోకం ఎవరో రారు నీ కోసం చేసే పనిని కష్టంగా భావించకు చిన్నదైన పెద్దదైన ఏ పనిలోనైన నేర్పరి ఉంటాడొక్కడు చేసేపనిని ఇష్టంగా చేసినప్పుడే కష్టం అనిపించదు గొప్పవాడైందుకు అందలమెక్కాలని ఆశపడకు అత్యాశే అధముడిని చేస్తుంది గాలిలో మేడలు కట్టకు పునాదిలేని ఇల్లు నిలబడేనా అడ్డుదారులు కావు నీ విజయానికి మెట్లు అవి అవుతాయి నీ పతనానికి జారుడు మెట్లు ఆశల హరివిల్లులు చేస్తాయి ఎన్నో గారడీలు ఆశ పడతివా అ ఊబిలో కూరుకపోవడం తథ్యం అడుసు తొక్క నేల కాలుకడగనేల నిరంతరం అది గుర్తించుకొని అడుగే వేయి ముందుకు ఆగనీకు నీ పయనం అజేయుడిగా సాగు ఆకాశమే హద్దుగా ఎవరికి వారే ఎమునా తీరు ఈలోకం ఎవరో రారు నీ కోసం నిను చూచి నవ్వే ఈ లోకం నవ్విన నాపచేను పండదా అనుకొనిసాగు నీ గెలుపుతో గులాము అవుతుంది లోకం ఎదిగే నిను చూచి వేలెత్తి చూపేవారు ఉండటం సహజం నువు నడిచే దారిలో ముళ్లు కొండలు గుట్టలు రాళ్లుంటాయి నీ దారి మంచిదైతే లెక్కచేయకు దేనని సాగిపో పరవళ్లు తొక్కే వరదలా తొక్కుకుంటూ తోసుకొంటూ అప్పుడే నీ వెంట నడుస్తారు నలుగురు నీ మార్గమే అవుతుంది రాచబాట ఎవరికి వారే ఎమునా తీరు ఈలోకం ఎవరో రారు నీ కోసం నువ్వు నలుగురిలో ఒక్కడిలా మిగిలిపోకు నలుగురిలో నువ్వొక్కడిగా ఎదగాలి చేసిన సహాయం మరిచినా సహాయం చేసిన చేతిని మరిచిపోకు అందలమెక్కాక మరిచిపోకు గతాన్ని గుర్తించుకో పడ్డకష్టాన్ని ఆదుకో అ కష్టం పడుతున్న నీ చుట్టుఉన్నవాళ్లని ఇవి సూక్తులు కావు మిత్రమా...... చదివి వదలేయడానికి జీవిత పాఠాలు మంచిగా బ్రతికేందుకు అవసరమయ్యే జీవన సత్యాలు ----- వీడియో నచ్చితే Like చేయండి, మీ అభిప్రాయాన్ని Comment చేయండి, మరిన్ని తెలుగు సాహిత్య, ప్రేరణాత్మక గీతాల కోసం ,వేమన పద్యాలకోసం Seshachandra Creations ఛానల్‌ను Subscribe చేయండి. #MotivationalSong #TeluguSong #జీవితసత్యాలు #ప్రేరణాత్మకగీతం #TeluguMotivation