Перейти к содержимому

E466 | విస్తీర్ణం తక్కువ రాబడి ఎక్కువ | ఆనందరావు | పల్నాడు జిల్లా

Andhra Pradesh Community Managed Natural Farming

0:00 / 0:00

E466 | విస్తీర్ణం తక్కువ రాబడి ఎక్కువ | ఆనందరావు | పల్నాడు జిల్లా

6 586 просмотров · 13 дн. назад
Andhra Pradesh Community Managed Natural Farming
26,2 тыс. подписчиков
6 586 просмотров · 13 дн. назад
పల్నాడు జిల్లా కోసూరు మండలం బయ్యారం గ్రామానికి చెందిన రైతు చిట్టడి ఆనందరావు 31 సెంట్ల భూమిలో ప్రకృతి వ్యవసాయ పద్ధతులను అనుసరిస్తూ కూరగాయలు సాగు చేస్తున్నారు. గతంలో రసాయన ఎరువులు, పురుగుమందుల వల్ల పెట్టుబడులు పెరిగి నష్టాలు ఎదుర్కొన్న ఆయన, గత మూడు సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం వైపు అడుగులు వేశారు. 20 సెంట్లలో టమాటా, 11 సెంట్లలో చిక్కుడు సాగు చేస్తూ, పందిరి పద్ధతితో టమాటా పంటను నిర్వహిస్తున్నారు. PMDS, జీవామృతం, నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం వంటి ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పాటిస్తూ తెగుళ్లు, పురుగులను నియంత్రిస్తున్నారు. పందిరి విధానంతో పంట నాణ్యత, దిగుబడి మెరుగుపడటంతో పాటు కాయలు దెబ్బతినకుండా చూసుకుంటున్నారు. రెండు పంటల ద్వారా నికర ఆదాయం పొందుతూ, తక్కువ విస్తీర్ణంలోనూ ప్రణాళికాబద్ధమైన ప్రకృతి వ్యవసాయంతో మెరుగైన రాబడి సాధిస్తున్నారు.