కోటి రూపాయల కాపర్ వైరుని.. భూమిలో పాతిపెట్టిన కేటుగాళ్లు..! - NDN News
NDN News
0:00 / 0:00
కోటి రూపాయల కాపర్ వైరుని.. భూమిలో పాతిపెట్టిన కేటుగాళ్లు..! - NDN News
5 650 просмотров · 4 нед. назад
NDN News
289 тыс. подписчиков
5 650 просмотров · 4 нед. назад
కోటి రూపాయల కాపర్ వైరుని..
భూమిలో పాతిపెట్టిన కేటుగాళ్లు..!
========================
తిరుపతి జిల్లా రేణిగుంటలో సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును పోలీసులు విజయవంతంగా ఛేదించారు. సుమారు రూ.1.20 కోట్ల విలువైన 7 టన్నుల కాపర్ వైర్‌ను దొంగిలించిన అంతర్రాష్ట్ర ముఠా గుట్టును రట్టు చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే.. బెంగళూరు నుంచి శ్రీసిటీకి తరలించాల్సిన కాపర్ వైర్‌ను లారీ డ్రైవర్ వినోద్ కుమార్.. తన స్నేహితులతో కలిసి మార్గమధ్యంలోనే మళ్లించాడు. ఎవరికీ అనుమానం రాకుండా తమిళనాడులోని వేలూరు సమీపంలో జేసీబీతో పెద్ద గుంత తవ్వి ఆ సరుకును భద్రంగా పాతిపెట్టారు. పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన రేణిగుంట అర్బన్ పోలీసులు.. నిఘా ఏర్పాటు చేసి తమిళనాడుకు చెందిన ఆర్. రాజా, కె. నవీన్ కుమార్ అనే ఇద్దరు నిందితులను అరెస్ట్ చేశారు. వారి నుంచి ఏడు టన్నుల కాపర్ వైర్‌తో పాటు లారీని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు వినోద్ కుమార్‌తో పాటు మరో వ్యక్తి పరారీలో ఉండగా, వారి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ కేసును తక్కువ సమయంలో ఛేదించిన పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించి రివార్డులు ప్రకటించారు.
► Download NDN Android App: http://goo.gl/Uvt9YB
► Like us on Facebook: https://goo.gl/va71DQ
► Subscribe to NDN HD Live: https://goo.gl/k6zj74
► Circle us on G+: https://goo.gl/OsCQgw
► Tweet NDN at : https://goo.gl/Xw1TQA