పొలంలో నీటి కుంటల ప్రాముఖ్యత || వేసవిలోను పచ్చని పంటలకు భరోసా || Farmer Venkat Reddy Sucess Secrets
Raitu Nestham
0:00 / 0:00
పొలంలో నీటి కుంటల ప్రాముఖ్యత || వేసవిలోను పచ్చని పంటలకు భరోసా || Farmer Venkat Reddy Sucess Secrets
217 185 просмотров · 7 лет назад
Raitu Nestham
1,41 млн подписчиков
217 185 просмотров · 7 лет назад
#Rythunestham #NaturalFarming #OrganicFarming
రైతు శ్రమకి నీటి చుక్కలు తోడైతేనే సాగు సాగుతుంది. జల సిరులు ఒడిసిపడితే పచ్చని పంటలు ద్వారా ఆదాయ సిరులు అన్నదాత ఇంటికి చేరుతాయి. కానీ ఈ విషయాన్ని మరిచి.. ఉన్న భూమి మొత్తంలో పంటలు వేసే పద్ధతి విస్తృతమైంది. వాన నీటి సేకరణ, నిల్వ చేసే పద్ధతులు అవలంబించే వారి సంఖ్య తగ్గిపోయింది. దాని ఫలితంగానే వ్యవసాయం నీటి సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే.. 20 ఏళ్ల తర్వాత పంటల సాగుకి నీటి చుక్క కూడా లభించని దుస్థితి ఏర్పడుతుంది. వ్యవసాయంలో ఆలోచన, ఆచరణ మారితేనే.. ఇలాంటి విపత్కర పరిస్థితులు రాకుండా అడ్డుకోవచ్చు. వాన నీటిని ఒడిసిపట్టేందుకు నీటి కుంటల నిర్మాణం చేసుకోవటంతో పాటు తక్కువ నీటితో సాగు చేసే పంటలు వైపు రైతులు మళ్లటమే ఉత్తమ ప్రత్యామ్నాయం.
నీటి కుంటల సూత్రాన్ని పక్కాగా అమలు చేసే రైతన్నలు... సాగులో విజయవంతంగా సాగుతారని నిరూపిస్తున్నారు... ప్రకాశం జిల్లా మార్కాపురం మండలం తిప్పాయి పాలెం గ్రామికి చెందిన కుందురు వెంకట రెడ్డి. సేద్యపు కుంట ద్వారా నీటి బ్యాంక్ ని ఏర్పాటు చేసుకొని... మండు వేసవిలోను పచ్చని పంటలు పండిస్తున్నారు. చేపల పెంపకం ద్వారా అదనపు ఆదాయాన్ని సైతం పొందుతూ... తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు.
సేద్యపు కుంట నిర్మాణాలకు అనువైన భూమి ఉన్న రైతులు... వీటి ద్వారా నీటి బ్యాంక్ ల ఏర్పాటు చేసుకుంటే ఎంతో మేలు జరుగుతుంది. ఈ దిశగా ముందడుగు వేసిన రైతులకు ప్రభుత్వం కూడా రాయితీలు కల్పించి ప్రోత్సహిస్తున్న ఇస్తున్న నేపథ్యంలో... రైతులు ముందుకు రావాల్సిన అవసరం ఉంది. తద్వారా వ్యవసాయం పండగ అవుతుంది. జల వనరుల సంరక్షణ సాధ్యం అవుతుంది.