యెహోవా జ్ఞాపకకర్తలారా ll YEHOVA GNAPAKAKARTHALARA || LATEST TELUGU CHRISTIAN SONG || PRAYER SONG
Soldiers For Jesus AP & TS
0:00 / 0:00
యెహోవా జ్ఞాపకకర్తలారా ll YEHOVA GNAPAKAKARTHALARA || LATEST TELUGU CHRISTIAN SONG || PRAYER SONG
8 710 просмотров · 3 мес. назад
Soldiers For Jesus AP & TS
4,9 тыс. подписчиков
8 710 просмотров · 3 мес. назад
#latestchristiansongstelugu #latestchristiandevotionalsongs #soldiersforjesussongs #latestteluguchristiansongs #sfj #sfjsongs #yehovagnapakakarthalara #jesustelugu #prayerwarriors #telugujesusnewsongs #newchristiansong #newchristiandevotionalsong #jesussongs #prardhanasong #vignapanaprardhanasong
Credentials:
స్క్రిప్ట్ - బ్ర. మహేష్, SFJ
ఆర్ధిక సహకారం - HC బ్ర.బెనర్జీ - శాంత కుమారి, కొత్తగూడెం
రచన & స్వరకల్పన -బ్ర. మణి ప్రకాష్, దేవరపల్లి
సంగీతం - బ్ర. విజయ సన్, నల్లమోతు
గానం - శ్రీ కృష్ణ
వీడియో - బ్ర. సాగర్, మిషనరి
Lyrics:
యెహోవా జ్ఞాపకకర్తలారా ఆ...
నిత్య విజ్ఞాపనకర్తలారా ఆ..
దేశం కోసం ప్రార్థించుటకు రండి
స్వజాతి రక్షణకై వేడగ రండి
నీ విశ్వాస ప్రార్థనయే దేశానికి రక్షణ
నీ మోకాళ్ళ అనుభవమే ఉజ్జీవ సాధన ||2||
యెహోవా జ్ఞాపకకర్తలారా ఆ...
1. ఇశ్రాయేలునకు దేవదేవునికి - మధ్య నిలిచెను మోషే దైవజనుడు
సోదోమగోమోర్రాల విడుదల కోసము - బ్రతిమలాడి వేడిన తండ్రి అబ్రాహాము
సంహారపు దూతవధను దైవ ఉగ్రతను - తప్పించుటకు ప్రణమిల్లెను దావీదు రాజు - 2
పరాయి రాజ్యములో ప్రజల సంకెళ్లనూ - విడిపించుటకు గోజాడిన దానియేలు
మోషేల ప్రార్థించు...
అబ్రాహాముల ప్రార్థించు...
దావీదుల ప్రార్థించు...
దానియేలుల ప్రార్థించు...
దిక్కు నీవే క్రైస్తవ జగతికై వేడగా
విజ్ఞాపనను విన్న తండ్రి ఆమెన్ పలుకగా. ||యెహోవా జ్ఞాపక||
2. స్వజాతి విడుదలకై ఉపవాస ప్రార్థనతో - రాజుల మనసు గెలిచిన నెహెమ్యా ఎస్తేరులు
లోక రక్షణకై సంఘ క్షేమముకై - రాత్రిపగలు కన్నీటితో వేడిన పరిశుద్ధ పౌలు
సంఘాలన్నీ ఐక్యముగా కలిసి ఉండాలని – శిష్యులందరూ సత్యములో ఎదగాలని - 2
దుష్టుని సోదనలో పడకుండా నిలవాలని - విజ్ఞాపనలు సలిపెను యేసు ప్రధాన యాజకుడు
నెహెమ్యాల ప్రార్థించు...
ఎస్తేరుల ప్రార్థించు...
పౌలుల ప్రార్థించు...
ప్రభువు క్రీస్తుల ప్రార్థించు...
దిక్కు నీవే క్రైస్తవ జగతికై వేడగా
విజ్ఞాపనను విన్న తండ్రి ఆమెన్ పలుకగా ||యెహోవా జ్ఞాపక||
3. వేల్స్ పట్టణ ఉజ్జివకర్త ఈవాన్ రాబాట్సన్ - ఇంగ్లాండ్ దేశాన్ని మేల్కొలిపిన జాన్ వెస్లీ
స్కాట్లాండ్ దేశపు ఉజ్జీవకర్త దైవజనుడు జాన్ నాక్స్ - మహా మెల్కొలుపు సాదానం మార్టిన్ లూదర్
నాటి ప్రార్ధనవీరుల కన్నీరు ఉజ్జీవమునకు సాధన – నేటీ సంఘాల ప్రార్థనలే మరో మేల్కొలుపు మార్గము -2
సమయాసము లన్నీటియందు జాగుచేయక – అందరి కొరకు భారముతో నిత్యము ప్రార్ధించు
ఉపవాసముతో ప్రార్థించు - సంఘముగా ప్రార్థించు
అనుదినము ప్రార్థించు – విసుగక నిత్యం ప్రార్ధించు
దిక్కు నీవే క్రైస్తవ జగతికై వేడగా
విజ్ఞాపనను విన్న తండ్రి ఆమెన్ పలుకగా
యెహోవా జ్ఞాపక కర్తలరా ఆ...
నిత్య విజ్ఞాపనకర్తలరా ఆ..
ప్రాకారాములను దిద్దపరచుటకు రండి బ్రద్దలైన సంధులలో నిలువగా రండి
నీ విశ్వాస ప్రార్థనయే దేశానికి రక్షణ
నీ మోకాళ్ళను అనుభవమే ఉజ్జీవ సాధన
యెహోవా జ్ఞాపకకర్తలారా ఆ...