Перейти к содержимому

ఇతరుల దూరనేల / ITARULA DURANELA / AAV 10 EP 965 / NC MURTHY / NC SREEDEVI / MALAHARI

ANNAMAYYA AKSHARA VEDAM

0:00 / 0:00

ఇతరుల దూరనేల / ITARULA DURANELA / AAV 10 EP 965 / NC MURTHY / NC SREEDEVI / MALAHARI

396 просмотров · 20 часов назад
ANNAMAYYA AKSHARA VEDAM
18,7 тыс. подписчиков
396 просмотров · 20 часов назад
ANNAMAYYA AKSHARA VEDAM EP – 965 🌺🍃 -----------🍃🌺 తాళ్లపాక అన్నమాచార్య ఆధ్యాత్మ సంకీర్తన ( ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు .. ) రేకు రాగము :- వరాళి రేకు: 0140-03 సంపుటము: 2-174 స్వరకర్త:- శ్రీ N.C. మూర్తి గారు రాగం :-- మలహరి గానం:- శ్రీమతి N.C. శ్రీదేవి గారు 🌺🍃 -----------🍃🌺 🌹🌹 సంకీర్తన 🌹🌹 ॥పల్లవి॥ ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు మతి వారూఁ దమవంటి మనుజులే కాక ॥చ1॥ చేరి మేలుసేయఁ గీడుసేయ నెవ్వరు గర్తలు ధారుణిలో నరులకు దైవమే కాక సారెఁ దనవెంటవెంటఁ జనుదెంచేవారెవ్వరు బోరునఁ జేసిన పాపపుణ్యాలే కాక ॥చ2॥ తొడఁగి పొగడించాను దూషించా ముఖ్యులెవ్వరు గుడికొన్న తనలోని గుణాలే కాక కడుఁగీర్తి నపకీర్తి గట్టెడివారెవ్వరు నడచేటి తనవర్తనములే కాక ॥చ3॥ ఘనబంధమోక్షాలకుఁ గారణ మిఁక నెవ్వరు ననిచిన జ్ఞానాజ్ఞానములే కాక తనకు శ్రీవేంకటేశుఁ దలపించేవా రెవ్వరు కొనమొద లెఱిఁగిన గురుఁడే కాక 🌺🍃 -----------🍃🌺 అన్నమయ్య అక్షరవేదం సంపుటి – 965 ( ఇతరుల దూరనేల యెవ్వరూ నేమి సేతురు .. ) 🌺🍃 ----------- 🍃🌺 ప్రార్థన :- ఎవనిని నిందించెదవయ ? భువి మనుజులె వారు కూడ , పుణ్యము పాపం- బివలన నీ సుకృతంబులె చవుకపరచు నీదు మదియె చలపాదిదయా ! ✍️ --స్వీయపద్యము ( కందము) ఓ మానవుడా! నీవు (నీ కష్టాలకు లేదా తప్పులకు) ఎవరిని నిందిస్తావు? ఈ భూమిపై ఉన్న ఇతర మనుషులు కూడా నీలాంటి వారే. నీ జీవితంలో జరిగే పుణ్యకార్యాలు కానీ, పాపకార్యాలు కానీ... వాటన్నింటికీ నీ మనస్సే కారణం. నిన్ను చులకన చేస్తున్నది నీ అంతరంగమే ! అది చంచలత్వమును వీడని మొండి పట్టుదల గలది . దానిని అదుపు చేసుకునే ప్రయత్నము చేయి మనకు జరిగే మంచి చెడులకు ఇతరులను బాధ్యులను చేయడం తప్పు. మన మనస్సు, మన ఆలోచనలు, మన కర్మలే మన జీవితాన్ని శాసిస్తాయి. కాబట్టి మనస్సును అదుపులో ఉంచుకోవాలి సదా , దానిని పరమాత్ముని వైపుకు మళ్ళించి ! 🙏 🌹🙏 🌹 🌺🍃 -----------🍃🌺 మున్నుడి 🌹 ఇది పదకవితా పితామహుడు తాళ్ళపాక అన్నమాచార్యుల వారు రచించిన అద్భుతమైన వైరాగ్య సంకీర్తన మనిషి తన జీవితంలో జరిగే మంచి చెడులకు, కష్టసుఖాలకు ఇతరులను నిందించడం వ్యర్థమని, అన్నిటికీ తన ప్రవర్తన, పూర్వకర్మలే కారణమని అన్నమయ్య ఈ కీర్తనలో ఎంతో చక్కగా వివరించారు. మరి చక్కని ఈ కీర్తన అర్థము తెలుసుకుని పాడుకుండామా ! 🌹🙏🌹 🌹🌹 మనకు జరిగిన దానికి ఇతరులను నిందించడం (దూరడం) ఎందుకు? ఎవరేం చేయగలరు? ఆలోచించి చూస్తే (మతి వారూ) ఆ ఇతరులు కూడా మనలాంటి తోటి మనుషులే కదా! మనలాగే వారు కూడా భగవంతుని చేతిలో కీలుబొమ్మలే తప్ప, స్వతంత్రంగా మనకు మంచి కానీ, చెడు కానీ చేసే శక్తి వారికి లేదు. 🌹🌹 ఈ భూమిపై మనుషులకు దగ్గరై మేలు చేయడానికి కానీ, కీడు తలపెట్టడానికి కానీ స్వతహాగా కర్తలు ఎవరున్నారు? అంతా ఆ దైవ నిర్ణయం ప్రకారమే జరుగుతుంది. అలాగే, మనిషి జీవితంలో ఎల్లప్పుడూ అతని నీడలా వెంటవెంట నడిచి వచ్చేది ఎవరు? తా ను చేసిన పాపపుణ్యాల కర్మఫలాలే తప్ప మరెవరూ రారు. వివరణ: ఒకరు మనకు సహాయం చేసినా, అపకారం చేసినా వారు కేవలం నిమిత్తమాత్రులు. దైవేచ్ఛ మరియు మన పూర్వ కర్మల వల్లే అవి జరుగుతాయి 🌹🌹 సమాజంలో మనల్ని ఒకరు పొగడాలన్నా లేదా దూషించాలన్నా అందుకు ముఖ్య కారకులు ఎవరు? మన హృదయంలో స్థిరపడి ఉన్న మన స్వంత సత్వ, రజో, తమో గుణాలే కదా! అలాగే మనకు గొప్ప కీర్తిని లేదా అపకీర్తిని (అపవాదును) తెచ్చిపెట్టేది ఎవరు? సమాజంలో మనం నడుచుకునే మన ప్రవర్తన, శీలమే తప్ప వేరే ఎవరూ కాదు. వివరణ: మన మంచితనం మనకు కీర్తిని ఇస్తుంది, మన చెడు ప్రవర్తనే మనకు అపకీర్తిని తెస్తుంది. కాబట్టి ఎదుటివారిని అనడం తప్పు. 🌹🌹 సంసారమనే గొప్ప బంధంలో చిక్కుకుపోవడానికి లేదా దాని నుండి మోక్షం (ముక్తి) పొందడానికి కారణం ఎవరు? మన మనస్సులో నిండియున్న జ్ఞానము, అజ్ఞానములే (వివేకము, అవివేకము) దానికి కారణం. మరి అటువంటి సంసార చక్రం నుండి మనల్ని గట్టెక్కించి, ఆ శ్రీవేంకటేశ్వరుని పాదాలను స్మరించేలా (తలపించేలా) చేసేది ఎవరు? సృష్టి యొక్క ఆది అంతములను, పరమాత్మ తత్త్వాన్ని పూర్తిగా తెలిసిన (కొనమొద లెఱిఁగిన) సద్గురువు మాత్రమే! వివరణ: అజ్ఞానం బంధాన్ని కలిగిస్తే, జ్ఞానం మోక్షాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానాన్ని ప్రసాదించి, వెంకటేశ్వరుని వైపు మన మనస్సును మళ్లించే శక్తి ఒక్క గురువుకే సాధ్యం. 🌹🙏🌹 ఓమ్ శ్రీ అలమేలుమంగా సమేత శ్రీ వేంకటేశ్వర స్వామినే నమః !🙏 తాత్పర్య సహిత దృశ్య మాలికగా మీకు అందించాలన్న నా చిన్న ప్రయత్నమును ఆశీర్వదిస్తారని ఆశిస్తూ..🙏 దోషములున్న...మన్నించమని విన్నపము... 🙏 ✍️ -- వేణుగోపాల్ యెల్లేపెద్ది 🙏 #ఇతరులదూరనేల #ITARULADURANELA #NCMURTHY #NCSREEDEVI #annamacharya #annamacharyakeerthanalu #annamayya #annamayyasongs #అన్నమయ్య #అన్నమాచార్య #annamayyakeerthanalu #annamayyakeerthana #annamayyaaksharavedam