ఏ పాపమెరుగని యో పావన మూర్తి | Telugu Christian Song | Suhitha | Isaac Joy | PBC Kazipet |
Penuel Baptist Church Official
0:00 / 0:00
ఏ పాపమెరుగని యో పావన మూర్తి | Telugu Christian Song | Suhitha | Isaac Joy | PBC Kazipet |
443 092 просмотра · 5 л. назад
Penuel Baptist Church Official
3,89 тыс. подписчиков
443 092 просмотра · 5 л. назад
మనుష్య కుమారుడు పరిచారము చేయించుకొనుటకు రాలేదు గాని పరిచారము చేయుటకును, అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణము ఇచ్చుటకును వచ్చెననెను. [ మార్కు సువార్త -10:45 ]
Lyrical Video.
Singer : Suhitha Golkonda
Music : Isaac Joy
Lyrics : Yarmanashetti Dhaveedu Garu
Video : BAT Channel [ • CALVARY JESUS VIDEO HD | Free HD Video - n... ]
Editing : Isaac Joy
Audio recorded , Mixed & Mastered at Isaac joy studios, Warangal.
Song LYRICS:
ఏ పాపమెరుగని యో పావన మూర్తి పాప విమోచకుండా
నా పాలి దైవమా నా పాపముల కొర కీ పాట్లు నొందినావా
ముళ్ళతో కిరీట – మల్లి నీ శిరముపై – జల్లాటమున మొత్తిరా
ముళ్ళ పోట్లకు శిరము – తల్లడిల్లగ సోమ్మ – సిల్లిపోతివ రక్షకా ||ఏ పాప||
కలువరి గిరి దనుక – సిలువ మోయలేక – కలవరము నొందినావా
సిలువ నీతో మోయ – తులువలు వేరొకని – తోడుగా నిచ్చినారా ||ఏ పాప||
చెడుగు యూదులు బెట్టు – పడరాని పాట్లకు – సుడివడి నడచినావా
కడకు కల్వరి గిరి – కడ కేగి సిల్వను – గ్రక్కున దించినావా ||ఏ పాప||
ఆ కాల కర్ములు – భీకరంబుగ నిన్ను – ఆ కొయ్యపై నుంచిరా
నీ కాలు సేతులు – ఆ కొయ్యకే సూది – మేకులతో గ్రుచ్చినారా ||ఏ పాప||
పలువిధంబుల శ్రమలు – చెలరేగ దండ్రికి – నెలుగెత్తి మొరలిడితివా
సిలువపై పలుమారు – కలుగుచుండెడి బాధ – వలన దాహము నాయెనా ||ఏ పాప||
బల్లిదుండగు బంటు – బల్లెమున నీ ప్రక్క – జిల్లి బడ బొడచినాడా
ఉల్లోలములవలె నల్ల నీరుబుకంగ జల్లారె గద కోపము ||ఏ పాప||
కట కటా పాప సం – కటము బాపుట కింత – పటు బాధ నొందినావా
ఎటువంటిదీ ప్రేమ – యెటువంటిదీ శాంత – మెటుల వర్ణింతు స్వామి ||ఏ పాప||
Thanks for watching .
subscribe for more videos
Do Like,comment & Share and Spread the gospel to the world...!
GOD BLESS YOU ALL ABUNDANTLY.