కాసేపు ఆగవా… మనస్వినీ… | Kasepu Aagavaa... Manaswini... | Telugu Cinematic Duet
విసురజ: మాట-పాట
0:00 / 0:00
కాసేపు ఆగవా… మనస్వినీ… | Kasepu Aagavaa... Manaswini... | Telugu Cinematic Duet
1 639 просмотров · 11 дней назад
విసురజ: మాట-పాట
131 подписчик
1 639 просмотров · 11 дней назад
Lyrics & Music
Jagannadh Velidimalla
bhavajhari.blogspot.com
Audio & Vocals
Generated with Suno AI
AI Visuals & Video Production
Vamsi Machiraju
Video Editing
Sampath Mudhiraju
Creative Suggestions & Encouragement
Gnaneswari Lavanaya
కాసేపు ఆగవా… మనస్వినీ…
ఊపిరై నిలవవా… అలివేణీ…
చెంత చేరి చేరగానే…
నేనే నీలో కలిసిపోనా… నిలిచిపోనా…
నీ చూపే నన్నే ముద్దాడితే…
నేను నాలా మిగలగలనా…
నీ చెలిమే తోడుంటే…
నా బతుకే మురిసిపోదా… మెరిసిపోదా…
(చరణం – 1)
తొలకరి వాన కౌగిలించ
మురిసి మిడిసే పుడమిలా
నీ రాకతో నా బతుకే
ఉప్పొంగిపోయే…
వసంతుడే పలకరించ
విరిసి నర్తించే వనరాణిలా
నీ తోడుతో నా మనసే
మయూరమయ్యే…
సాగరంకై పరుగులు తీసే నదిలా…
రివ్వున ఎగిరి నిను చేరి…
నీ ఒడిలో ఒదిగిపోనా…
కలిసిపోనా…
(చరణం – 2)
చీకటి చీర కప్పుకున్న
చుక్కల రేయి నవ్వినట్లు…
నీ చూపే తాకిన నా గుండె
కోటి కోటి వెలుగులే పంచిపోయే…
ఎండిన కొమ్మకు చిగురొచ్చి
పచ్చని పాట పాడినట్లు…
నీ పలుకే తాకిన నా వలపే
చిగురులు తొడిగి పూదోటయిపోయే…
చీకటి దుప్పటిని తొలిగించే వెలుగులా…
మనసులోని తీపి తపనలకు కబురంపనా…
నీ ప్రేమలో వెలిగిపోనా…
కరిగిపోనా…
(తుది ముగింపు)
నీతో పంచుకునే ప్రతిక్షణం
నాకొక యుగమేలే …
నీ చెంత గడిపే జీవితమే
ఎనలేని వరమేలే …
చెంత చేరి చేరగానే…
నేనే నీలో కలిసిపోనా… నిలిచిపోనా…
కాసేపు ఆగవా… మనస్వినీ…
ఊపిరై నిలవవా… అలివేణీ…
కాసేపు ఆగవా… మనస్వినీ…
ఊపిరై నిలవవా… అలివేణీ…