నమ్మితిగదరా రామయ్య కీర్తన - ఏకతాళం - Bhajana - Mokila - రాకమచెర్ల సంకీర్తనలు
JAI HANUMAN BHAJANA MANDALI
0:00 / 0:00
నమ్మితిగదరా రామయ్య కీర్తన - ఏకతాళం - Bhajana - Mokila - రాకమచెర్ల సంకీర్తనలు
24 034 просмотра · 2 года назад
JAI HANUMAN BHAJANA MANDALI
1,15 тыс. подписчиков
24 034 просмотра · 2 года назад
నమ్మితిగదరా రామయ్య కీర్తన - ఏకతాళం
నమ్మితిగదరా రామయ్య ! నన్ను సమ్మతించర రామయ్య !!ప!! యేమి శేతురా రామయ్య ! నికింకా దయరాదేమయ్య ! యిమ్మహిలోని సుఖమ్మలు వేడక సమ్మతితో మీస్మరణ సతమ్మని !!న!!
1 కోరికలేదుర మరియేమి ! నినుగూడిన భాగ్యము కొదువేమి ! పారము నొందెటి దారికొరకు ! నినుదూరితి యికనా నేరములెన్నకు !!న!!
2 ఘనులగు వారలు నీవారా ! యీజనముల కెల్లను నేదూరా ! ధనవంతుల మది దగిలుందువు ! నీపసిగంటిని బహుపక్షపాతివిగ !!న!!
3 పాతకుడని మదిదలచకుమీ ! నాపాలిదేవుడవు నీవెసుమి ! భూతలమున బహు దాతవనుచు ! ప్రఖ్యాతివింటి బహునీతి శాలివని !!న!!
4 శరణాగత బిరుదుందికదా ! ననుకరుణించ నీదెసాక్షిగదా ! పరమ మునీంద్రుల బ్రహ్మాముఖ్యులను ! మరువకబ్రోచె దొరవని వేడితి !!న!!
5 యెంతపాపినో రామయ్య ! నీకింకా దయరాదేమయ్య ! మంతనమున బహు శాంతుడవని ! నీచెంతజేరితిని సుందరరూపక !!న!!
6 ధరణిలో వెంకటదాసుడరా ! నను మరచిన నినునే మరువనురా ! గురుతు గలిగి నాకోరిక దీర్చవే ! శిరిగల రాకమచర్ల స్వామివని !!నమ్మితి!!