E488 | పందిరి సేద్యంతో ప్రకృతి సిరులు | శ్రీకాంత్ | పల్నాడు జిల్లా
Andhra Pradesh Community Managed Natural Farming
0:00 / 0:00
E488 | పందిరి సేద్యంతో ప్రకృతి సిరులు | శ్రీకాంత్ | పల్నాడు జిల్లా
2 867 просмотров · 3 дня назад
Andhra Pradesh Community Managed Natural Farming
26,2 тыс. подписчиков
2 867 просмотров · 3 дня назад
పల్నాడు జిల్లా, ఎడ్లపాడు మండలం, కొత్తపాలెం గ్రామానికి చెందిన శ్రీకాంత్ బీటెక్ పూర్తి చేసిన తర్వాత ఉద్యోగాన్ని వదిలి తల్లిదండ్రులకు వ్యవసాయంలో తోడ్పడేందుకు ముందుకొచ్చారు. రసాయనాల వినియోగాన్ని తగ్గించి, ప్రకృతి వ్యవసాయ పద్ధతులతో సాగు ప్రారంభించారు. తన పొలంలో ప్రధాన పంటగా మునగను సాగు చేస్తూ, దొండ , క్యాబేజీ, సొరకాయ, పొట్లకాయ, కాకరకాయ వంటి అంతర పంటలను పెంచుతున్నారు. జీరో టిల్లేజ్, మల్చింగ్, ఘనజీవామృతం, ద్రవజీవామృతం వంటి పద్ధతులతో నేల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో పాటు నీటి వినియోగం, పెట్టుబడి ఖర్చులను తగ్గిస్తున్నారు. స్వయంగా విత్తనాలను తయారు చేసుకుంటూ, ఏడాది పొడవునా పంటల ద్వారా ఆదాయం పొందుతున్నారు. తన అనుభవంతో ఒకే పంటపై ఆధారపడకుండా నాలుగైదు రకాల పంటలను సాగు చేయాలని, ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు ఆదాయాన్ని పెంచుకుంటూ నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని శ్రీకాంత్ సూచిస్తున్నారు.