Brahmotsava Veduka No.1/Video 675/వైకుంఠ వైభవమూ — మలయప్ప దర్శనం
ARTA
0:00 / 0:00
Brahmotsava Veduka No.1/Video 675/వైకుంఠ వైభవమూ — మలయప్ప దర్శనం
682 просмотра · 13 дней назад
ARTA
431 подписчик
682 просмотра · 13 дней назад
Lyrics by Smt Suvarna Lakshmi/ Music generated by AI
వైకుంఠ వైభవమూ — మలయప్ప దర్శనం
మాడ వీధుల నడుమ — అదె బ్రహ్మోత్సవం
వైకుంఠ వైభవమూ — మలయప్ప దర్శనం
మాడ వీధుల నడుమ — అదె బ్రహ్మోత్సవం
శ్రీ వేంకటేశా! అలన నీ వైభోగ ఉత్సవం
బ్రహ్మ తలచె ఇల గాంచ — దివ్య వేడుక
వైకుంఠ వైభవమూ — మలయప్ప దర్శనం
మాడ వీధుల నడుమ — అదె బ్రహ్మోత్సవం
గరుడ ధ్వజమూ గగనాన రెపరెపలాడ
వేద ఘోష మలయాచలమున ప్రతిధ్వనించ
దివ్యమైన నీ సేవకు సమయమిదియని
ఆహ్వానమంది దేవతలు ఋషులు దిగివచ్చిరి
పరబ్రహ్ముని ఇల గాంచ
ఉరగశయనుడవు శేషాచలవాసుడవని
ఆదిశేషుని పెద్దశేష వాహనమున ఊరేగితివి
వాసుకి మథన సేవ మదిలో మెదలగా
చిద్విలాసముగా చిన్నశేష వాహనం ఎక్కితివి
హంసావతార బోధ మదిన స్మరించి
బ్రహ్మవాహనమైన హంస నెక్కితివి
ఆపదలో భక్తుని చేయి విడువనని
ప్రహ్లాదవరదుడవై సింహవాహనుడవై కదలితివి
ముత్యపు చిప్పన పొందైన ఆణిముత్యము వలె
ముత్యాల పందిరిలో ముద్దుగా వెలసితివి
ఆశ్రితుల కోరికలు ఆలకించు దైవము నీవని
కల్పవృక్ష నీడలో కరుణతో నిలిచితివి
రాజులకు రాజువు శరణార్థులను కాచు ధర్మప్రభువువు
భువనపాలకా! సర్వభూపాల సేవలో సార్వభౌముడవు
లోకరక్షక లీలాకృతుడవై అమృతము పంచి
మోహినిగా మురిపించి ఊరేగు మోహనాంగా!
వేదస్వరూపుడు వినతాతనయుడు
నిత్యవాహనుడు గరుడుడని
గరుడగమనుడవై తిరిగితివి
రామనామమే ఊపిరై రామకార్యమే జీవితమనిన
నిగర్వి హనుమంతునిపై కూర్చొని వేంచేసితివి
హిరణ్యగర్భుడవు నీవని తెలుపుచూ
శోభాయమానుడవై స్వర్ణరథమున ఎక్కితివి
ఆర్తుల పిలుపు విని ఆదుకొను దైవము నీవని
గజేంద్రుని బ్రోచిన గంభీరుడవని
గజమునధిరోహించితివి
సూర్యనారాయణుడవు నీవని కర్తవ్యనిష్ఠుడవని
నీ తేజమును సూర్యప్రభలతో చాటితివి
చల్లని చూపుతో పౌర్ణమి వెన్నెలవై
ప్రకాశించువాడవు నీవని
చంద్రకళలతో శోభిల్లు శశిబిందుడవు
పరమాత్మవు త్రిగుణాతీతుడవు త్రికాలజ్ఞుడవని
జీవుల ఆత్మరథుడవని రథమున ఊరేగు మనోరథుడవు
కాలకాలముల ధర్మనిరతికై
అవతారాల అద్భుతుడవై వెలయు అశ్వవాహనుడవు
చక్రస్నానముతో గంగను పవిత్రము చేసి
సుదర్శన తేజముతో ఉత్సవములలో ఊరేగి
మమ్ములనలరించు బ్రహ్మాండనాయకుడవు
హేమాంగుడవు శ్రీ వేంకటరమణుడవు
వైకుంఠ వైభవమూ — మలయప్ప దర్శనం
మాడ వీధుల నడుమ — అదె బ్రహ్మోత్సవం
వైకుంఠ వైభవమూ — మలయప్ప దర్శనం
మాడ వీధుల నడుమ — అదె బ్రహ్మోత్సవం