Malayappa Vybhavam/ Video 677/నీరజనాభుడు — జగదోద్ధారుడు
ARTA
0:00 / 0:00
Malayappa Vybhavam/ Video 677/నీరజనాభుడు — జగదోద్ధారుడు
152 просмотра · 9 дней назад
ARTA
431 подписчик
152 просмотра · 9 дней назад
Lyrics by Smt Suvarna Lakshmi/ Music generated by AI
నీరజనాభుడు — జగదోద్ధారుడు
సొగసుల మలయప్ప — శ్రీనిధియై వచ్చె!
నీరజనాభుడు — జగదోద్ధారుడు
సొగసుల మలయప్ప — శ్రీనిధియై వచ్చె!
పంకజభవుడు కొలిచిన — పద్మనాభుడు
అలమేలుమంగమ్మ — మనోరమణుడు
సౌందర్యనిధియై — తా భక్తులను
పలుకరించ వచ్చె!
నీరజనాభుడు — జగదోద్ధారుడు
సొగసుల మలయప్ప — శ్రీనిధియై వచ్చె!
ఉత్సవ సేవలందు — పద్మపీఠముపై
దేవదేవుడు — దేవేరుల నడుమ నిలిచి
రత్నకిరీటము శిరమున — రమణీయముగా వెలుగ
తిరునామము, కస్తూరి తిలకము — నుదుటన మెరయ!
కంఠాభరణములు — కంఠమున కాంతులీన
రత్నహారములు — వక్షమున రమ్యముగా ఒదగ
పతకముల తళుకులు — పసిడి వన్నెలు చిలుక
శ్రీనివాసుని సిరులెల్ల — కన్నుల పండువలాయె!
భుజకీర్తుల వెలుగులు — భుజములపై విరియ
కంకణములు కరములందు — కాంతులతో మెరయ
శంఖచక్రముల శోభ — సకల దిక్కుల నిండ
వరదహస్తముతో నిలిచె — వేంకటాద్రి వరదుడు!
కటిబంధము నడుమన — కనక వన్నెలు చింద
పట్టు పీతాంబరము — పాదాబ్జములు తాక
శ్రీదేవి భూదేవులతో — సిరులొలుకు వేళ
వీధులేగు స్వామికి — వేడుకలే వేడుకలు!
వైనతేయునిపై స్వామి — వైభవము విశిష్టము
మెడలో మకరకంఠి — మెరుపులతో మహిమ చాట
లక్ష్మీ కాసులహారము — వక్షమున విరాజిల్ల
కాసు కాసునా శ్రీరూపము — కాంతులీన!
హారముల వరుసలెల్ల — హృదయమున ఒదిగి
రత్నముల తళుకులెల్ల — రేయిని వెలిగించ
గరుడునిపై శ్రీపతిని — కనులార గాంచి
పరవశించి భక్తకోటి — పరమానందము చెందె!
సహస్రనామ కాసులహారము — సిరులొలుకగా
వేయి నామముల మహిమ — వక్షమున వెలుగగా
కిరీట కాంతులు — శంఖచక్ర దీప్తులు కలియ
గరుడసేవలో స్వామి — ఘనత వెల్లివిరిసె!
మంగళవాద్యములు — మధురముగ మ్రోగగా
గోవింద నామములతో — గగనమెల్ల నిండగా
దర్శనమిచ్చె దయతో — దాసజనులకెల్ల
హేమాంగుడు — సర్వలోక నాయకుడు — చల్లని చూపులవాడు!
నీరజనాభుడు — జగదోద్ధారుడు
సొగసుల మలయప్ప — శ్రీనిధియై వచ్చె!
నీరజనాభుడు — జగదోద్ధారుడు
సొగసుల మలయప్ప — శ్రీనిధియై వచ్చె!