Перейти к содержимому

Vandanamulive song/ Video 678/ వందనములివే — జగతి ఆనంద వందనములివే!

ARTA

0:00 / 0:00

Vandanamulive song/ Video 678/ వందనములివే — జగతి ఆనంద వందనములివే!

192 просмотра · 6 дней назад
ARTA
431 подписчик
192 просмотра · 6 дней назад
Lyrics by Smt Suvarna Lakshmi/ Music generated by AI వందనములివే — జగతి ఆనంద వందనములివే! వందనములివే — జగతి ఆనంద వందనములివే! మదిలో శ్రీపతిని మనసార కొలచి, స్వామి నిత్య కైంకర్య సేవలకై, తమ కలిమిని అర్పించిన ధన్యులకు— ॥ వందనములివే — జగతి ఆనంద వందనములివే! ॥ ॥ వందనములివే — జగతి ఆనంద వందనములివే! ॥ పల్లవ రాణి సామవై పెరుందేవి భక్తితో, వెండిమయ భోగశ్రీనివాసుని వేడుకతో ప్రతిష్ఠింపజేసి, రత్నకిరీటము, మకరకుండలములు, రమణీయ హారములు సమర్పించెను. నిత్య సేవలకై భూములనొసగి, నిండుగా తన భక్తిని చాటె; భుజాభరణములు, చేతి కంకణములు, బంగారు కటిబంధము భక్తితో ఒసగె. కెంపుల వెలుగులు, పచ్చల మెరుపులు, ముత్యపు సొబగులు— భోగశ్రీనివాసుని సేవల కొరకై సమర్పించె. ॥ వందనములివే — జగతి ఆనంద వందనములివే! ॥ ॥ వందనములివే — జగతి ఆనంద వందనములివే! ॥ శ్రీకృష్ణదేవరాయ నృపాలుడు శ్రీపతి సన్నిధి చేరి, నవరత్న కిరీటము, కానుకలిచ్చి, కడు నమ్రతతో శిరసు వంచె. వెండి పళ్లెములు స్వామికొసగి, వేడుక సేవలే కోరె; రాజ్య వైభవము నీ కృపయనుచు, ఆనందనిలయమునకు బంగారు తాపడం చేసి, స్వామి పాదములే మ్రొక్కె. రాయల పత్నులు తిరుమలదేవి, చిన్నాదేవి, తిరువేంకటపతిని కొలచి, బంగారు పాత్రలు సమర్పించిరి. ఉత్సవమూర్తులు ముగ్గురికీ ఉజ్జ్వల రత్నకిరీటములు చేయించి, కనకాభిషేకము చేయించిరట. ॥ వందనములివే — జగతి ఆనంద వందనములివే! ॥ ॥ వందనములివే — జగతి ఆనంద వందనములివే! ॥ రాయలవారు వారికి ఒసగిన తాళ్ళపాక గ్రామమును అన్నమయ్య వంశస్త పెద్ద తిరుమలాచార్యులు తాళ్లపాక గ్రామమును భక్తితో దేవుని సొమ్ముగా యెంచి తరగని సేవకు బాటలు వేసి, తరతరములు స్వామి పూజలు సాగునట్లు చేసిరి. ॥ వందనములివే — జగతి ఆనంద వందనములివే! ॥ ॥ వందనములివే — జగతి ఆనంద వందనములివే! ॥ పల్లవ రాజులు, జాతక వర్మ, వీరనరసింహరాయలు, రాఘోజీ భోంస్లే రాజు— రత్నాభరణములు, విలువైన కానుకలు అర్పించిరి. శ్రీ జయేంద్ర సరస్వతి యతివరులు, జగదీశుని సేవను కోరి, వజ్రకిరీటము సమర్పించి, వేంకటేశుని పాదములు కొలచిరి. ఒడిశా భక్తుడు శాలిగ్రామ హారములిచ్చి; మనసున స్వామినే నిలిపె. హృదయము స్వామికే అర్పించి, కానుకలతో తమ భక్తిని చాటి, కమలాపతి కృపను కోరిన ధన్యులెందరో! ॥ వందనములివే — జగతి ఆనంద వందనములివే! ॥ ॥ వందనములివే — జగతి ఆనంద వందనములివే! ॥ పేరు తెలిసిన దాతలకెల్లను, పేరు తెలియని భక్తులకును, నిత్యమూ నీ సేవ నిలిపిన వారికి నిండు మనసుతో వందనములు. పుష్పమూ, ఫలమూ, తులసీదళమూ, జలమునైనను ప్రేమతో స్వీకరించు హేమాంగా! శరణార్థులను చేరదీయు సుగుణాభిరాముడవు, భక్తవత్సలుడవు, శ్రీ వేంకటాద్రి నిలయుడవు! వందనములివే — జగతి ఆనంద వందనములివే! వందనములివే — జగతి ఆనంద వందనములివే!