Veduka chooda raarandi/ Video 679/వేడుక చూడ రారండి
ARTA
0:00 / 0:00
Veduka chooda raarandi/ Video 679/వేడుక చూడ రారండి
139 просмотров · 4 дня назад
ARTA
431 подписчик
139 просмотров · 4 дня назад
Lyrics by Smt Suvarna Lakshmi/ Music generated by AI
వేడుక చూడ రారండి —
బ్రహ్మోత్సవ వేడుక చూడ రారండి!
ఏడుకొండల రాయుడు, వాసుదేవుడు,
వరదుడు, కలియుగ దేవుని
వేడుక చూడ రారండి —
బ్రహ్మోత్సవ వేడుక చూడ రారండి!
విష్వక్సేనుడు స్వామి సేనాధిపతి,
తిరుమాడ వీధుల తొలుత పరిశీలించి తిరిగేను ;
విఘ్నములెల్లను వారింపగను,
విఘ్నరాజును ప్రార్థించి,
శ్రీపతి వేడుకకు శ్రీకారమిడగా!
॥ వేడుక చూడ రారండి — బ్రహ్మోత్సవ వేడుక చూడ రారండి ॥
భూదేవిని భక్తితో కొలిచి విప్రులు,
పావన మృత్తిక భువినుండి గొని;
మంగళవాద్యముల నడుమ,
మంత్రములతో యాగశాల చేరేరు!
॥ వేడుక చూడ రారండి — బ్రహ్మోత్సవ వేడుక చూడ రారండి ॥
సస్యసమృద్ధితో జగము వెలుగవలెనని,
రాత్రివేళను పాలికలందు మృత్తిక నింపి;
నవధాన్యములే అందున చల్లి,
సోముని సస్యముల రాజుగా ఎంచి;
అంకురార్పణము చేసి,
బ్రహ్మపీఠమును అలంకరించు!
॥ వేడుక చూడ రారండి — బ్రహ్మోత్సవ వేడుక చూడ రారండి ॥
గరుడధ్వజమును గగనాన ఎగురవేసి,
బ్రహ్మాది దేవతలను ఆహ్వానించి;
ఋషిగణములకు వందనములొసగి,
వేదఘోషలతో యాగశాల వెలుగగా,
వేడుకలందున భక్తి విరియగా!
॥ వేడుక చూడ రారండి — బ్రహ్మోత్సవ వేడుక చూడ రారండి ॥
నవదినముల దివ్యోత్సవమున,
నానావిధ సేవలు నారాయణునకు చేతురు;
వేదనాదములు ఏకముగా మ్రోగగా,
వేంకటగిరియే వైకుంఠమై అలరగా!
॥ వేడుక చూడ రారండి — బ్రహ్మోత్సవ వేడుక చూడ రారండి ॥
శేష, హంస, సింహ, గజ,
అశ్వవాహనములపై;
ముత్యపుపందిరిలో,
స్వర్ణరథమున, రథమున;
సర్వభూపాల వాహనమున,
హనుమంత, గరుత్మంత వాహనములపై;
సూర్యచంద్ర ప్రభలపై మోహనాంగుడు,
కల్పవృక్షమున కామితార్థములొసగగా,
భక్తులెల్లరు గూడి—
॥ వేడుక చూడ రారండి — బ్రహ్మోత్సవ వేడుక చూడ రారండి ॥
పావన తీర్థ పుష్కరిణిలో,
దివ్య సుదర్శనము కాంతులీనగా;
చక్రస్నానోత్సవమే జరిపి,
మాధవుని కరుణ మనసార వేడు!
॥ వేడుక చూడ రారండి —
బ్రహ్మోత్సవ వేడుక చూడ రారండి ॥
ఏడుకొండల రాయుడు, వాసుదేవుడు,
వరదుడు, కలియుగ దేవుని
వేడుక చూడ రారండి —
బ్రహ్మోత్సవ వేడుక చూడ రారండి!
ఏడుకొండల రాయుడు, వాసుదేవుడు,
వరదుడు, కలియుగ దేవుని — హేమాంగుని
వేడుక చూడ రారండి!
బ్రహ్మోత్సవ వేడుక చూడ రారండి!