పచ్చి పనసకాయ కూర | Panasakaya Kura | Jackfruit Curry - The Meatless Meat You Must Try
HomeCookingTelugu
0:00 / 0:00
పచ్చి పనసకాయ కూర | Panasakaya Kura | Jackfruit Curry - The Meatless Meat You Must Try
29 343 просмотра · 1 год назад
HomeCookingTelugu
267 тыс. подписчиков
29 343 просмотра · 1 год назад
పచ్చి పనసకాయ కూర | Panasakaya Kura | Raw Jackfruit Curry in Telugu | Veg Curry for Rice & Roti@HomeCookingTelugu
#PanasakayaKura #JackfruitCurry #RawJackfruitRecipe #PanasakayaRecipe #vegetariancurry #TeluguVegRecipes #SouthIndianRecipes
Other Recipes :
Panasakaya Dum Biryani : • పనసకాయ దమ్ బిర్యానీ | Panasakaya Dum Birya...
Kacche Aam Ki Sabji : • పచ్చి మామిడికాయ కూర |Pachi Mamidikaya Kura...
పచ్చి పనసకాయ కూర :
కావాల్సిన పదార్ధాలు :
పచ్చి పనసకాయ
ఉప్పు - 1 టీస్పూన్
పసుపు - 1/2 టీస్పూన్
తరిగిన అల్లం
తరిగిన వెల్లుల్లి రెబ్బలు - 5
నానపెట్టిన కాశ్మీరీ ఎండుమిరపకాయలు - 7
మిరియాలు - 1 టీస్పూన్
జీలకర్ర - 1 టీస్పూన్
ధనియాలు - 2 టీస్పూన్లు
చిన్న దాల్చిన చెక్క , లవంగాలు , రెండు యాలకులు
నీళ్ళు
ఆవనూనె - 2 టేబుల్స్పూన్లు
ఉడికించిన పచ్చి పనసకాయ ముక్కలు
ఆవనూనె - 3 టేబుల్స్పూన్లు
బిర్యానీ ఆకులు - 2
జీలకర్ర - 1 టీస్పూన్
పొడవుగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు - 3
రుబ్బుకున్న మసాలా పొడి
ఉప్పు - 1 టీస్పూన్
తరిగిన టొమాటో ముక్కలు - 2
ఉడికించిన పనసకాయ నీళ్ళు
పనసకాయ ముక్కలు
నీళ్ళు - 1 కప్పు
తరిగిన కొత్తిమీర
కార్డ్స్ :
10 నిముషాలు ఉడకనివ్వాలి
5 నిముషాలు కలపాలి
10 నిముషాలు ఉడకనివ్వాలి
తయారీ విధానం :
ముందుగా పచ్చి పనసకాయను తీసుకొని మీడియం సైజు ముక్కలుగా కోసి పెట్టుకోవాలి.
తరువాత నీళ్లలో వేసి ఒక టీస్పూన్ ఉప్పు , అరా టీస్పూన్ పసుపు వేసి పది నిముషాలు ఉడికించుకోవాలి.
పది నిముషాలు తరువాత వడకట్టి పక్కనపెట్టాలి.
తరువాత మిక్సీ జార్ లో తరిగిన అల్లం , తరిగిన ఐదు వెల్లుల్లి రెబ్బలు , నానపెట్టిన ఏడు కాశ్మీరీ ఎండుమిరపకాయలు , ఒక టీస్పూన్ మిరియాలు , ఒక టీస్పూన్ జీలకర్ర , రెండు టీస్పూన్లు ధనియాలు , చిన్న దాల్చిన చెక్క , లవంగాలు , రెండు యాలకులు , కొద్దిగా నీళ్ళు పోసి మెత్తని పేస్ట్ లా రుబ్బుకొని పెట్టుకోవాలి.
కడై లో రెండు టేబుల్స్పూన్లు ఆవనూనె , ఉడికించిన పనసకాయ ముక్కలు వేసి ఐదు నిముషాలు వేయించుకోవాలి.
అదే కడై లో మూడు టేబుల్స్పూన్లు ఆవనూనె , రెండు బిర్యానీ ఆకులు , ఒక టీస్పూన్ జీలకర్ర , పొడవుగా తరిగిన మూడు ఉల్లిపాయ ముక్కలు వేసి ఐదు నిముషాలు వేయించుకోవాలి.
తరువాత రుబ్బుకున్న మసాలా పేస్ట్ , ఒక టీస్పూన్ ఉప్పు వేసి కలుపుకోవాలి.
తరువాత సన్నగా తరిగిన రెండు టొమాటో ముక్కలు వేసి కలిపి ఉడికించిన పనసకాయ నీళ్ళు ఒక కప్పు వేసుకోవాలి.
మూత పెట్టి పది నిముషాలు ఉడకనివ్వాలి.
పది నిముషాలు తరువాత పనసకాయ ముక్కలు వేసి ముక్కలకు మసాలా పటేటట్టు బాగా కలుపుకోవాలి.
ఒక కప్పు నీళ్ళు పోసి కలిపి మూత పెట్టి పది నిముషాలు ఉడకనివ్వాలి.
పది నిముషాలు తరువాత తరిగిన కొత్తిమీర తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోండి.
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...
You can buy our book at https://shop.homecookingshow.in/
Follow us :
Facebook- / homecookingtelugu
Youtube: / homecookingtelugu
Instagram- / home.cooking.telugu
A Ventuno Production : http://www.ventunotech.com